పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/192

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధికరణకుడు : (శకారకుడి కోసం వేసిన ఆసనంమీద కూర్చుంటూ) శోధనకా! కార్యార్థిని చెప్పుకో మను. శోధనకుడు : (శకారుడితో) అయ్యా! మీరు చేసే నింద ఏమిటో చెప్పుకోండి. శకారుడు : మా బావగారు నాకు క్రీడించటానికి ఉద్యానవనాల్లో కల్లా శిరోభూషణ మీ పుష్పకరందోద్యానమిచ్చారు. నేను ప్రతిదినం అక్కడ చెట్టు ఎండబెడుతాను. చివుళ్ళు తెంచుతాను. అధికరణకుడు : అయితే ముఖ్యాంశ మేమిటో త్వరగా బయటపెట్టండి. శకారుడు : నాకు అక్కడ ఈ దినం... ఒక స్త్రీ... శవం... ఒకటి... కనిపించింది. అం హం హం... కనిపించలేదు. అధికరణకుడు : ఆ స్త్రీ ఎవరో మీకు తెలుసా? శకారుడు : హఁ హఁ హఁ (వెర్రిగానవ్వి) నాకు తెలియకపోవటమేమిటి? ఒళ్ళంతా బంగారంతో ఓయ్యారపు నడకలు నడిచే నా స్త్రీని నేనెరగనా? బలే ప్రశ్న వేశావు మొత్తానికి? అధికరణకుడు : అయితే ఆమె మీకేమౌతుంది? శకారుడు : ఏమౌతుందేమిటి? నా స్త్రీ. అధికరణకుడు : అయితే మీ స్త్రీని ఎవరు చంపారని మీ అనుమానం? శకారుడు : దుర్మార్గుడు చారుదత్తుడి ఇంట్లో ఆమె పూర్వం కొన్ని నగలు దాచమన్నది. వాటిని అపహరించటానికి ఆమెను చంపాడు. ఆ పాపం మెడకు చుట్టటానికిని నా జీర్ణోద్యానంలో పారేశాడు. అధికరణకుడు : అయితే ఎవరు చంపారని మీ అనుమానం? శకారుడు : "నేను కాదు” అధికరణకుడు : "నేనుకాదు" (అని ఉచ్చరిస్తూ తాళపత్రం మీద వ్రాసుకుంటాడు) శకారుడు : అధికరణకా! దీనికే ఇంత (ఎక్కిళ్ళు) అల్లట తల్లటైపోతున్నావేం? ఎవరో చంపితే చూచానని వ్రాసుకో. అధికరణకుడు చారుదత్తుడు చంపాడని మీకు ఎలా తెలిసింది? 192 వావిలాల సోమయాజులు సాహిత్యం-2