పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/191

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పదునాల్గో దృశ్యం (న్యాయస్థానము అధికరణకుడు, శోధనకుడూ, వారి వారి స్థానాలల్లో కూర్చోని ఉంటారు) అధికరణకుడు శకారయ్య! మదనిక!! శోధనకుడు : శకారయ్య! శకారయ్య!! - మదనిక! మదనిక!! (మదనిక ప్రవేశించి అటూ ఇటూ చూచి ఒకమూల నిలవబడుతుంది. శకారుడు న్యాయస్థానాన్ని నాలుగుదిక్కులూ వెర్రిగా పరిశీలిస్తుంటాడు). అధికరణకుడు : శోధనకా! ఆయన ఎవరో కనుక్కో. శోధనకుడు : ఎవరు మీరు? శకారుడు : “ఎవరు మీరు" - అప్పుడే కళ్ళింత నెత్తికెక్కాయా? ఓరి మీ తస్సలుదియ్యా! (బింకంగా) శకారమహారాజును! అధికరణకుడు : కోపించకండి మహారాజా! అలా అడగటం మా సంప్రదాయం. శోధనకా! మహారాజులుంగారికి ఆసనమిచ్చి మర్యాదచేయవోయ్! శకారుడు : (శోధనకు డిచ్చిన అసనంమీద కూర్చొనబోతూ) అధికరణకా! మా వ్యవహారం చక్కగా చూడకపోతే మాఅక్కతో చెప్పి మా బావతో చెప్పించి మీ ఉద్యోగాలు ఊడబెరికిస్తాను, జాగ్రత్త! శోధనకుడు : చిత్తం - చిత్తం - దయచేయండి. శకారుడు : (కైపువల్ల తేణుస్తూ) ఈ నేలంతా నాదే. నా ఇష్టం వచ్చినచోట కూర్చుంటాను. ఇక్కడ కూర్చోనా? అక్కడ కూర్చోనా? (అధికరణకుడి దగ్గిరికిపోయి) నీవు లే ఇక్కడ కూర్చుంటాను. కాదులే. ఇక్కడే కూర్చుంటాను. వసంతసేన 191