ఈ పుటను అచ్చుదిద్దలేదు
రదనిక : (వ్రేలితో చూపిస్తూ) అదుగో - బాబయ్యా! ఆ మనుష్యుల మధ్య నడిచేది చారుదత్తయ్యగారే - ఆ! పెద్దబాబయ్యగారే! మైత్రేయుడు : అవును నిజమే. (చత్వారమున్నట్లుగా పరిశీలించి) ఆఁ. అతగాడే - అటూ ఇటూ ఉన్నది రక్షాధికారులే! - ఆఁ అధికరణమంటపానికే. రదనిక : అధికరణమంటపానికా? మైత్రేయుడు : అమ్మాయీ! నీవేమీ భయపడకు - ఏదో నెత్తిమీదికి తెచ్చిపెట్టుకున్నాడు. అతడేం చేస్తాడు. గ్రహచారం పెద్దమ్మ నెత్తిమీద ఎక్కి పాతచెప్పుతో పకాళించి తంతుంటే. నీవు ఇంటికి వెళ్లు. నేను సంగతేమిటో విచారించి వస్తాను. అక్కగారికి ఈ సంగతేమీ తెలియనీయకు. (నిష్క్రమిస్తాడు). రదనిక : (మైత్రేయుడు వెళ్ళిపోయిన దాకా చూచి నిష్క్రమిస్తుంది). (తెర) 190 వావిలాల సోమయాజులు సాహిత్యం-2