శకారుడు : (పీక నులుముతాడు) వసంతసేన : చారు... దత్తా (మూర్ఛపోతుంది) శకారుడు : (చేతులతో ఎండుటాకులదాకా తీసుకోపోయి కప్పి గుటకలు వేస్తూ చేతులు దులుపుకుంటూ) ఉడతను మింగిన పిల్లిలాగా ఉప్పిడిచప్పిడి లేకుండా బావ మళ్ళీ వచ్చేటప్పటికి వెళ్ళిపోతాను. (కూనిరాగంతో). “రాధమ్మ మాటవిని రంభ చెడిపోయింది రామయ్య కైపోయె లంకకాపురము” రాధమ్మ.... కుంభీలకుడు : (ప్రవేశించి) బావా! వసంతసేన ఏదీ? శకారుడు : ఏదీ? తప్పించుకోపోయింది. కుంభీలకుడు: (అనుమానంతో) నిజం చెప్పు. శకారుడు : (నవ్వుతూ) చంపేశాను బావా! (చూపిస్తాడు). కుంభీలకుడు : (నిర్ఘాంతపోతాడు). శకారుడు : నాకేం భయం! ఇది చారుదత్తుడి ఇంట్లో నగలు దాచిపెట్టింది. అవి కాజెయ్యటానికి అతడే ఈమెను చంపాడని అపవాదు కల్పిస్తాను. కుంభీలకుడు : ఒక పాపానికి మరొక పాపమా! - అంతా నేను వెళ్ళి అధికరణకులకు చెపుతాను. శకారుడు : నాకేం భయం. చెప్పుకో. తాడూ బొంగరం లేని నీ మాటలు ఎవరు వింటారు. చెప్పుకో - అంతగా అవసరమైతే అక్కగారితో చెప్పి, బావగారితో చెప్పించి, వాళ్ళ ఉద్యోగాలే ఊడబెరికిస్తాను. తెలిసిందా? జాగ్రత్త! కుంభీలకుడు : ఏముంది - రెండు ఒదులుకుంటే సరి ప్రపంచంలో, మానం, అభిమానం రాజ్యాలు జయించవచ్చు రాజులు కావచ్చు. శకారుడు : (కోపంతో) చీ! అధిక ప్రసంగం చాలించు సంతోషంతో) హం హం హం - (వసంతసేనవైపు చూచి 186 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/186
ఈ పుటను అచ్చుదిద్దలేదు