పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/185

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శకారుడు : (కత్తి అందిస్తూ) దీన్ని చంపు. కుంభీలకుడు : (చెవులు మూసుకుంటాడు). శకారుడు : ఈ ఉద్యానవనంలో చంపితే నిన్నెవరూ చూడరు. కుంభీలకుడు : చంద్రుడూ, నక్షత్రాలూ, వనదేవతా చూస్తూనే ఉన్నారు. శకారుడు : (పై ఉత్తరీయం అందిస్తూ) ఇదిగో దీన్ని చాటుచేసి చంపు. బంగారు కడియాలు బహుమానమిస్తాను - చంపనా? కుంభీలకుడు : ఉC: శకారుడు : నిన్ను కూడా (పైకి దూకపోతే). కుంభీలకుడు : ఓయి, బాబో! (పారిపోతాడు). శకారుడు : వసంతసేనా! నీకు కావలసినన్ని నగలు చేయిస్తాను మేడలు కట్టిస్తాను. వసంతసేన: పూర్వమే బుద్ధి ఒక సహకారాన్ని ఆశ్రయించింది. ఇక పలాశాల మీదికి పోదు. శకారుడు : ఆ దరిద్రచారుదత్తుడు నీకు సహకారమా! నేను పలాశమా! - వాడినే స్మరించు. వసంతసేన : సర్వదా ఆ మహానుభావుడు నా హృదయంలోనే ఉన్నాడు. శకారుడు : అయితే నన్ను ప్రేమించవా? వసంతసేన : ప్రేమించలేను! శకారుడు ఒకటి - రెండు - మూడు.

వసంతసేన : (మౌనంగా ఊరుకుంటుంది). శకారుడు : (వెళ్ళి పీక పట్టుకుంటాడు) వసంతసేన : మహానుభావా! చారుదత్తా!! శకారుడు : ఇప్పటికైనా నన్ను ప్రేమించు. వసంతసేన : చారుదత్తా! - వసంతసేన 185