పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/183

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శకారుడు : (వేగంగా ప్రవేశించి) ఆఁ ఆఁ. ఆగు ఆగు నాకు దిక్కెవరు? వరపురుషుణ్ణి, వాసవుణ్ణి, మానవ వాసుదేవుణ్ణి నేనుండగా నీకీదుర్భర దురంతచింత ఏలనే తక్కోల నీలవేణీ! కుంభీలకుడు : (వెనకనుంచి ప్రవేశిస్తూ) మహారాజా! తాము ఇంకా రాలేదనే మా చెల్లెలు భయపడుతున్నది. మీకోసమే మా చెల్లెలు వచ్చింది. శకారుడు : బావా! నీ వల్లనే మా అదృష్టం పండి రాలిపోతున్నది. వెనక మీ చెల్లెలికి కోపం వచ్చేటట్లు ప్రవర్తించాను - కాదే ప్రసవశరసుమ కొదమకోమలవల్లీ! (విటుడితో) నీవు కొంచెం దూరంగా వెళ్లు - నేను కాస్త కాళ్ళమీద పడి ఆమెకు కనికరం కలిగేటట్లు కామతంత్రం జరపాలి. పక్కన పరపురుషుడుంటే పడుచువయసుది - ఉపపతి అంటే భర్త చెప్పిన మాట వినదు. ఉఁ. (వెళ్ళమని సంజ్ఞ చేస్తాడు) కుంభీలకుడు : (వెళ్ళబోతుంటే) వసంతసేన : (వినలేక చెవులు మూసుకొని సంభాషణ ఐనతరువాత గద్గద స్వరంతో) అన్నా! శరణు - నేను చిక్కులో పడ్డాను. కుంభీలకుడు అమ్మాయీ! నీకేమి భయంలేదు. (అని వెళ్ళిపోయి ప్రక్కన నిలుచుంటాడు) శకారుడు : (కాళ్ళమీద వాలుతూ) వసంతసేనా! మనోహారిణీ!! నీవు చిక్కులో పడ్డావు నేను నా సమస్తసామంతమణిగణకోటీరమైన నా శిరస్సుతో నీ పాదాబ్జాలమీద పడుతున్నాను. సమస్త దుర్నయాలూ క్షమించి నన్నేలుకోవే గోరోజనాతిలక పాటల ఫాలదేశా! అర్చితరతీశా!! వసంతసేన: (వారిస్తూ) ఛీ! మూర్ఖుడా!! - నేను నీకోసం రాలేదు. శకారుడు : మూర్ఖుడా! (అతికోపంతో) 'మూర్ఖ'! - బావా! (కుంభీలకుడు నెమ్మదిగా ప్రవేశిస్తాడు) బావా! నిన్ను చూచి మీ చెల్లెలిని సహించాను. చూస్తున్నావా, నాకు ఎంతలో ఎంతెంత కోపం తెప్పిస్తున్నదో! - నా ఉద్యాన వనానికి వచ్చి నాకింత కోపం తెప్పిస్తుందా? ఒప్పించు మీ కోసమే వచ్చానని చెప్పించు. (దగ్గిరకు పోతాడు) వసంతసేన (కోపంతో) నడు. అవతలికి. శకారుడు : బావా! ఇక దీన్ని ఊరుకోను. జడపట్టి జటాయువు, వాలి పెళ్లాన్ని పెళ్ళాడినట్లు... వసంతసేన 183