భిక్షుకుడు : అయ్యా! నేను కొత్త సన్యాసిని.
శకారుడు : అలా చెప్పు. పుట్టినప్పటినుంచీ నీవు సన్యాసివి కావా?
భిక్షుకుడు : (భయంతో) అహఁ
శకారుడు : ఎందుకు కాలేదో చెప్పు - లేకపోతే -
భిక్షుకుడు : తథాగతా! తథాగతా!!
శకారుడు : నిన్ను బయటికి వెళ్ళనీయను. ఇక్కడ నీ పంచప్రాణాలూ అన్నుపట్టి పోవలసిందే.
భిక్షుకుడు : తథాగతా! బుద్ధభగవాన్!-
శకారుడు : కానీ - ఒక పనిచేస్తే నిన్ను కనికరించి ఒదిలిపెడతాను. ఇదిగో ఆ సరస్సులో నీళ్ళను నీవు నీ చిల్లుల శాటిలో మూటకట్టి అందులో పిండిన బురదలో దానిని ఉతికితే -
భిక్షుకుడు : (ఆలోచించి) అలాగే - మూర్ఖమహేంద్రా!
శకారుడు : మూర్ఖమహేంద్రా!!
కుంభీలకుడి గొంతు : (తెరలో) బావా! బావా!!
శకారుడు : ఆఁ. బావ బండితో అప్పుడే వచ్చేశాడా?
కుంభీలకుడు : (దగ్గిరకు వచ్చి బెట్టుగా చేతులు కట్టుకొని నిలబడతాడు)
శకారుడు : బావా! సన్యాసి దీవించిన దానిలో (మూర్ఖ శబ్దాన్ని వదిలేసి) మహేంద్రా అంటే ఏమిటి?
కుంభీలకుడు: 'దేవేంద్రా' అని.
శకారుడు : (భిక్షుకుడి దగ్గరికి వచ్చి) ప్రభో! - అలా మళ్ళీ ఒకమాటు దీవించండి. నా పుష్కరిణికి వచ్చి నిత్యమూ మీ గుడ్డ తడుపుకొండి. నేను మీ శిష్యుణ్ణి. మీ దీవెనవల్ల నేనే దేవేంద్రుడనైతే (చంకలు కొడుతూ) ఆర్యకుడు సిద్ధుల దీవనలవల్ల రాజౌతాడని భయపడుతూ ఉన్న మా బావగారు నన్ను చూచి ఇంకా భయపడతాడు. భయపడాలి! హిఁ హిఁ హిఁ ప్రభో! హిఁ హిఁ హిఁ.
178
వావిలాల సోమయాజులు సాహిత్యం-2