పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/160

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శర్వీలకుడు : పిరికితనం - అయినా నియంతల రాజ్యాలల్లో బందీని చేయటానికి కారణాలేం కావాలి? అనుమానం క్రింద అరవై ఏళ్ళదాకా శిక్షించవచ్చు. అతణ్ణి కారాగారంనుంచి తప్పించటం నా ధర్మం. వసంతసేన : అతణ్ణి విడిపించే ప్రయత్నం చేసినవాళ్ళకు ఉరిశిక్ష వేయిస్తామని ఉజ్జయినీ అంతా చాటించారటగా? శర్విలకుడు : అందుకని భయపడతానా? ఆత్మసఖుడు - అనవసరంగా కారాగారంలో కష్టాలు పడుతుంటే నా ఆత్మ ప్రశాంతి వహించలేదు. మిత్రులందరినీ కలుసుకొని రేపోమాపో వాణ్ణి బయట పడేసే ప్రయత్నం చేయాలి. వసంతసేన : (మదనికను చూపిస్తూ) మా అమ్మాయి అభిప్రాయం అడిగారా? శర్వీలకుడు : (మదనిక వంక చూచి నవ్వుతాడు). వసంతసేన : మదనికా! మరి మరిదిగారికి నీ అభిప్రాయమేమిటో చెప్పు. మదనిక: (సిగ్గుతో మౌనం వహిస్తుంది). వసంతసేన : (శర్విలకుడితో) మౌనం అర్ధాంగీకారం. శర్వీలకుడు : (నవ్వుతో) పరిపూర్ణాంగీకారమే వసంతసేన : (నవ్వులో నవ్వు కలుపుతూ) ఇప్పుడు సగమూ, పూర్వము సగమూనా?

శర్వీలకుడు, వసంతసేన (నవ్వుకుంటారు) శర్వీలకుడు : మీ చెల్లెలు నేను తిరిగివచ్చేదాకా మీ యింట్లోనే ఉంటుంది - (శర్విలకుడు చేతి ఉంగరం తీసి దగ్గరికి వచ్చిన మదనిక చేతివేలికి పెట్టి చేయి ముద్దాడి వెళ్ళిపోతాడు. వసంతసేన వారి అనురాగవీక్షణాలను పరికిస్తూ మురిసిపోతూ ముఖవిన్యాసాలతో ఆనందం వెల్లడిస్తుంటుంది. అతడు వెళ్ళిపోయేదాకా ఇద్దరూ వెంటవెళ్ళి తిరిగివస్తారు) వసంతసేన : అమ్మాయీ! మా మరిది ఎంత సాహసి అయినా తగు జాగ్రత్త ఉన్నవాడు. మదనిక: (దిగులుతో దూరంగా నిలుచుంటుంది). వసంతసేన : అమ్మాయీ! మదనికా!! (దగ్గిరవున్న పీఠంమీద కూర్చోబెట్టుకొని నా జీవితంలో ఇంత ఆనందప్రదమైన దినం వెనుక రాలేదు. మదనికా! నీవు ఒక ఇంటిదానివైనావు. 160 వావిలాల సోమయాజులు సాహిత్యం-2