మదనిక పూలబ్రతుకె అరిగినదా శర్వీలకుడు : నాకమైన ఈ లోకము మదనిక : నరకముగా మారు నొహో! శర్విలకుడు : మదనిక : మరల మరల నోహో! ఈ మధువసంత మరుదెంచునె? యౌవ్వనసుఖ మనుభవింప కేల బేల లయ్యెదరు? (శర్విలకుడు, మదనిక ప్రవేశిస్తారు. ఇద్దరూ వసంతసేనకు నమస్కరిస్తూ) వసంతసేన : సుపుత్రప్రాప్తిరస్తు. శర్విలకుడు : అమ్మా! మరి నాకు సెలవిప్పిస్తారా? ఈ వసంతసేన : మా చెల్లెలూ మీరూ ఈ ఊళ్ళోనే ఉండటానికి నిశ్చయించుకున్నారా? కొన్నాళ్ళపాటు మా మదనిక నా దగ్గరనే ఉండాలని నాకు కోరికగా ఉంది. శర్వీలకుడు : ప్రస్తుతం మీ కోరికకే అనుకూలపరిస్థితి కూడా తోడైవచ్చింది. వసంతసేన : అదేమిటి? (ఇద్దరి మొగాలూ చూస్తుంది) శర్వీలకుడు : మా ఆర్యకుడి సంగతి మీరు విన్నారా? వసంతసేన : మా ఆర్యకుడంటే... శర్వీలకుడు : పోనీ ఏ ఆర్యకుని గురించైనా విన్నారా? వసంతసేన : ఆఁ, విన్నాను. ఎవరో యాదవ యువకుడు ఉన్నాడనీ, ఒక సిద్ధుడు అతని చేయి చూచి ఈ దేశానికి రాజౌతాడని జోస్యం చెప్పాడనీ విన్నాను. శర్వీలకుడు : అవును. అతడే మా ఆర్యకుడు, నాకు చిరకాల మిత్రుడు, మన రాజుగారు ఆ సిద్ధుడిమాట విని వాణ్ణి పట్టి తెప్పించి చెరలో పెట్టాడు. వసంతసేన కారణం? వసంతసేన 159
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/159
ఈ పుటను అచ్చుదిద్దలేదు