పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/147

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడో దృశ్యం

(వసంతసేన గృహంలో అంతర్భాగం. ఆమె చారుదత్తుని చిత్రాన్ని కూనిరాగాలు తీసుకొంటూ చిత్రిస్తూ పూర్తి చేస్తూ ఉంటుంది. ఇంతలో మదనిక ఏదో పని ఉన్నట్లు ప్రవేశిస్తుంది)

వసంతసేన : (కుంచెతో చిత్రపటాన్ని చిత్రిస్తూనే) మదనికా!

మదనిక: (మాట్లాడదు)

వసంతసేన : ఇదుగో? ఇటు చూడు!

మదనిక: (చూడదు)

వసంతసేన : చూడవా?

మదనిక : (ముద్దుగా అతిపరిచయ కంఠంతో) ఉఁః

వసంతసేన : పోనీలే చూడకపోతే మానిలే - (భావాన్ని మార్చి) ఈ చిత్రపటం ఎవరిదో చెప్పవే చూదాం?

మదనిక : (వసంతసేన దగ్గరికివచ్చి వేలితో మందలిస్తూ) చెప్పనా?

వసంతసేన: (చిరునవ్వుతో చెప్పమన్నట్లు తల ఊపుతుంది)

మదనిక : (నెమ్మదిగా నొక్కి ఒకమాట తరువాత ఒక మాటగా) నీవు కన్నార్పకుండా... ముగ్ధమోహనంగా... పరమాభిలాషతో... బహుళాసక్తితో

వసంతసేన : ఎంతసేపు ఈ స్వస్తి కానీ

మధనిక : (వేగంగా) ఎవరిని చూడటానికి ఇష్టపడతావో

మదనిక : వసంతసేన : వాళ్ళది

వసంతసేన : ఈ వక్రోక్తులు కట్టిపెట్టి ఏడిపించక త్వరగా చెప్పు.

—————————————————————

వసంతసేన

147