పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/146

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శర్వీలకుడు : (మావిగున్నవైపు బయలుదేరుతాడు. అతనికి మదనిక పాట వినిపిస్తుంది)

మదనిక : నీదే, నీదే, మధుకరుడా!

నీ ప్రియసుమ మిది మధుకరుడా!!
రసికుల లోపల రాజువురా!
ప్రసవకులమ్మున రాణినిరా! నీదే, నీదే....

మధువులు నిండిన బేల ఇదీ,
మనసున నిన్నే వలచినదీ,
తలపున నేయెడ నీవె సదా,
వలపే జీవననావ గదా! నీదే, నీదే.....

(నిష్క్రమించును)

————————————————————

146

వావిలాల సోమయాజులు సాహిత్యం-2