పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/127

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడో దృశ్యం

(చారుదత్తుని గృహము - ఏకాంతంగా వసంతసేన)

నీకు నీవే సాటి.
నాకు నేనే సాటి.
ఓ మనోహరతేజ!
ఓ మధువ్రతరాజ!! ॥ నీకు నీవే... ॥

పాలింపగా రమ్ము
ప్రణయసుమ మిది రాజ!
ఈతావి నీకొరకె.
ఈతనువు నీ కొరకె. ॥ నీకు నీవే... ॥

చారుదత్తుడు : (సాలోచనగా వసంతసేన వెనుకనుంచి ప్రవేశించి ఉత్తరీయం అందిస్తూ) రదనికా! చిట్టితండ్రి ఆరుబైట నిద్రపోతున్నాడు. - పాపం! చలి వేస్తుంటుంది. ఇది తీసుకోపోయి కప్పిరాపో.

వసంతసేన : (అందుకుంటూ తావి మూర్కొంటుంది) చారుదత్తుడు : అమ్మాయీ! పోనీ రోహసేనుణ్ణి లోపలికి తీసుకోపోయి మండువాలో నిద్రపుచ్చు - రదనికా!

మైత్రేయుడు : (రదనికతో ప్రవేశించి) ఉహు హూ! చారుదత్తా! ఆమె ఎవరనుకున్నావో! మన రదనిక కాదు వసంతసేన! ఇదిగో రదనిక అమ్మాయీ! రోహసేనుణ్ణి మండువాలో నిద్రపుచ్చు-

రదనిక : (వసంతసేన ఇస్తూ ఉన్న ఉత్తరీయం అందుకుంటూ నిష్క్రమిస్తుంది)

చారుదత్తుడు: వసంతసేనా! రదనికని భ్రాంతిపడి నిన్ను ఆజ్ఞాపించాను ఉత్తరీయ మందించి నీ శరీరాన్ని దూషితం చేశాను.

———————————————————————————

వసంతసేన

127