పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/119

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వసంతసేన : (బుగ్గమీద తట్టి) చాల్లేవే పరిహాసం, మదనికా! మనఃస్వస్థత చూచుకొని ఏకాంతంగా మీ ఇంటికే వస్తాననటంలో...

(శకారుడూ, కుంభీలకుడూ ప్రవేశించిన తరువాత)

శకారుడు : (రాజనంతో) ఒరేయ్! మనం దానికిచ్చిన హారాలు లెక్కవేస్తే ఎన్నైనై.

కుంభీలకుడు : (నమ్రభావంతో లెక్కిస్తూ) దరిదాపు మూడు వందలు?

శకారుడు : (దగ్గుతూ) మనతో అది సరిగాఉంటే ఇంకా ముట్టేవి కావట్రా!

కుంభీలకుడు : మహాప్రభువులు ముట్టకపోవటమేమిటి తమ దగ్గిర!

శకారుడు : (వేదికమీద కూర్చున్న వసంతసేన, మదనికల నుద్దేశించి) ఒరేయ్! వాళ్ళెవరో కనుక్కో!

కుంభీలకుడు : (మదనికతో) అమ్మాయీ! మీరెవరు? ప్రభువుగారు...

మదనిక : అయ్యా! వారెవరు?

కుంభీలకుడు : శ్యాలక మహారాజులుంగారు!

మదనిక : (వెళ్ళిపోదామన్నట్లు కనుసంజ్ఞ చేస్తూ) అక్కా! శ్యాలక మహారాజులుంగారు! శ్యాలకమహారాజులుంగారు! (లేచి పూజాపాత్రికతో మదనిక శకారుడు దగ్గరకు వచ్చి వంగి నమస్కరించి జారుకుంటుంది. ముందే వసంతసేన వెళ్ళిపోతుంది)

కుంభీలకుడు : ఏదో గుసగుసలాడి ఆ పిల్లపోరి మళ్ళా వస్తుందనుకున్నాను. పరిగపిట్టల్లా ఇద్దరూ పారిపోతున్నారు. బావా! నీవు వేసిన పన్నాగం పారలేదు.

శకారుడు : (గతుకుతూ ఉన్న గొంతుకతో) ఆఁ, రెండు పిట్టలూ మన మన్మథబాణాల గురి తప్పించుకుని పారిపోయినయ్! ఉఁ (కోపంతో) ముందుగా నీవు వాళ్ళతో మాట్లాడిరాలేదన్నమాట!

కుంభీలకుడు : అయితే మటుకు మాట్లాడినట్లు కనిపిస్తారా నీవే చొరవ చేసుకోవాలి గాని.

శకారుడు : (అలోచించి ఉద్వేగంతో) ఆ దరిద్ర చారుదత్తుడితో అంతసేపు గౌరవమిచ్చి మాట్లాడిందే మహాప్రభువు అని నీవు చెప్పినా అది మాటైనా మాట్లాడకుండా దుక్కిపిట్టలా తుర్రుమంటుందా బావా! (*) ఇది

———————————————————————

వసంతసేన

119