పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/855

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24. ఈవికాండ్ర - దానపరులను, దాతలను
25. చీరికిగొనుట - పాయ నొందించుట, చీలికను పొందించుట
26. కోసుమీరు - దైర్ఘ్యము వహించు, పొడుగునతిశయించు
27. కలగల్పు - కలియునట్టు కలిపిన
28. వినుకలియును - ఆకర్ణించి (శ్రవణమొనర్చి) వానిని పొందుట (కనుకలి - వీక్షించి
     పొందుట)
29. విడిసీమలొ –ఒంటరి లేదా ప్రతాపముగల ప్రదేశము లేక దేశమునందు
30. మర్కటయ్య చౌకట్లు - మొగకోతికి నాలుగు ముత్తెముల చేర్చి కుట్టిన (కట్టిన) పోగులు
31. తెన్నువారికంటె-మార్గమువలె ప్రసరించు వారికంటె
32. కన్నాకులు - కన్ను+ఆకులు కన్ను - నేత్రము జూడ కనుపు వంతెనద్వారము
     తమలపాకు కట్టనో మొదట ఉంచిన పెద్ద ఆకు
33. శ్రీశర్ముడు - సంపదతో కూడిన సంతోషము కలవాడు
34. క్షేత్రం-పుణ్య ప్రదేశము (భూమి)
35. తీర్ధము - పుణ్యనది, పుణ్యనదీ ప్రదేశము
36. ప్రాచేతసుడు - వాల్మీకి ప్రచేతసుడు మహర్షి
37. వక్షోజములు - కుచములు, స్తనములు
38. అఘమర్షణము - సమస్త పాపాలను పోగొట్టటానికి పఠించే (జపించే) మంత్రము
     (ఋగ్వేదము 10-190)
39. పాంశువు - దుమ్ము
40. స్వాధ్యాయము - తన శాఖకు చెందిన వేదాధ్యయము లేదా జపము
41. కాకిలము కంఠహారము
42. నిస్తులము - సాటిలేని
43. నిస్సీమము - హద్దులేని
44. సంహననము -నశింపజేసేది
45. దేవరాజ్య - స్వర్గ
46. దివోదాస - స్వర్గదాసుడు
47. విక్రాంతులు - ప్రకాశములను
48. జాలమ్ముల సమూహముల వల

________________________________________________________________________________

ఉపాయనలు

855