పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/854

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కఠిన పదములకు అర్థములు -ఉపాయనలు - కానుకలు

1. రజ్యత్ - శోభించుచున్న
2. పరీవారుడు - సముదాయము గలవాడు
3. గోలోమీ - గోవుల (పవిత్రమైన) తనూరుహములు (వెండ్రుకలు) గలవాడా
4. అబ్జయోని - పద్మమునుండి పుట్టినవాడు (బ్రహ్మ)
5. నాభీకమలుడు - శ్రీమహావిష్ణుని నాభిపద్మమైనవాడు (బ్రహ్మ) సురభిళములు
    మంచివాసనలు గలవి
6. కర్మకులు - కర్మల నాచరించువారు
7. క్రమ- రమణీయమైన
8. పరివస్య - పూజ
9. నతుల - మ్రొక్కుదలలు
10. దివిజులు - దేవతలు
11. పంచాస్త్రా - అయిదు పుష్పములు (చూతము మొదలైనవి) అస్త్రముగా గలవాడు
    (మన్మథుడు) చిలుకతేరు - శుకరథము (మన్మథుని వాహనము) గంధవాహ -
     వాయువు.
12. పుష్పధన్వి - పూ విల్లుకలవాడు (మన్మథుడు)
13. నీరదవు - మేఘమువు
14. నిస్తులము - పరుషమైనది
15. భంజకములు-విరుచునది
16. భాజనాల-భోజనా పాత్రలు
17. చషకము - మద్యపానమొనరించుపాత్ర
18. కర్ణధారి - ఓడను సరియైన మార్గాన నడుపువాడు
19. హర్యశ్వములు - ఆకుపచ్చని గుర్రములు
20. శబలాశ్వములు - చిత్రవర్ణపు గుర్రములు
21. లయకారుడు - నృత్యగీత వాద్యముల సమముగా నుండువాడు
22. ఎకిమీడుల - ప్రభువుల, రాజన్యుల
     సురభిళము - మంచివాసన గలది
23. పెండరము - గౌరవ సూచకమైన కడియము
     సింహతలాటము - గౌరవ సూచకమైన సింహముఖముగల కంకణము

________________________________________________________________________________

854

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1