పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/853

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆమోదింపగ వలసిన
సత్యమైన విషయమ్ము,
కొన్ని వత్సరాల నుంచి
ముద్రణమ్ము లేని దీన్ని
“భట్టు-విద్యలకే భట్టు-
ఆదిభట్టు-నారాయణ
దాసు” అన్న శీర్షికతో
ముద్రణ గావింపజేసి
సమాజాన్కి అందించం
గావలె నని శ్రీ ఈశ్వర
రావు మనసునందున తల
పెట్టినాడు. ఎంతోమంది
గ్రంథాలను ముద్రణగా
వింపజేసి లోకానికి
అందించిన ఈశ్వరరా
వున కారాధ్యుండు అయిన
నారాయణ దాసుగారి
జన్మరహస్యాన్ని తెలుపు
దీనిని ముద్రింపబూను
కొనుట ఎంతో సమంజసము.
అయిన కార్య యైయున్నది.
ఈ రీతిగ నిది ముద్రణ
పొంది స్వచ్ఛరీతిని ఈ
శ్వరరాయల మూలంగా
లోకానికి అందింపం
గాబడవలె అనెడి నమ్మ
కముతోనే కాబోలు అ
శరీరవాణి వీరి పుత్రి
క ద్వారా సృజియించుట.
దీని రహస్యాన్ని, భట్ట,
ఆవిర్భవ రహస్యాన్ని
తెలుసు కొని ప్రతివ్యక్తీ
ఆనందం పొందుతాడు
అంటు నేను ఆశిస్తా!
చిరంజీవ రాజేశ్వరి
దేవికి, ఈశ్వరరావుకు,
వారి కుటుంబాలకు నా
దివ్యమైన ఆశీస్సులు!!
ఈ గ్రంథం ఆంధ్రదేశ
పాఠకలోకాన్ని చేర
టాన్ని చూచి దాసుగారి
ఆత్మ అయిన జగన్మాత,
వాగ్దేవత సంతసించి
ఆశీస్సుల నందింపం
గాగల దాని దృఢముగ నే
ఆశిస్తూ ఉన్నాను.
జ్ఞప్తిచేస్తు ఉన్నా నివి
విశ్వయోగి విశ్వంజీ
విశ్వమందిరమ్ము నుంచి
అందించిన ఆశీస్సులు.

________________________________________________________________________________

ఉపాయనలు

853