పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/851

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


"విశ్వ మెల్ల శక్తిస్వరూ
పము, ఇచ్ఛాశక్తి, జ్ఞాన
శక్తి, క్రియాశక్తిగాను
శోభిస్తూ, ఇద్ది సర్వ
లోకానికి శక్తినిచ్చు
విశ్వవ్యాపకము అయిన
జ్ఞానశక్తి సమాజాన్కి
నూత్నశుభ మొనర్చు దివ్య
సంకలనముతో ఈ భువి
నేదో ఒక ఆకారా
న్నాధారము చేసుకోని
ఆవిర్భావమ్ము నొంది
తద్వారా సమాజాన్కి
జ్ఞానభిక్ష ప్రసాదించ
ట మ్మనునది అప్పుడప్పు
డరుదుగాను జరుగుతున్న
విషయమ్ము. ఆవిధంగ
ఆవిర్భవ మొందినట్టి
దివ్యవ్యక్తులు దివ్య మ
హాపథముల ప్రవర్తించి
ఈ సమాజమునకు ఒక్క
నూతనమ్ము, విశిష్టమ్ము
అయిన సాధనామార్గము
నందజేస్తు ఉంటారు.
నారాయణదాసు గారు
అట్టి మహాపుణ్యమూర్తి!
కేవలము సరస్వతీ
అవతార మ్మయినవారు,
ఆదిభట్ట నారాయణ
దాసుగారు! వీరు "హరిక
థాపితామహులుగ” జగ
ద్విఖ్యాతిని పొందినారు.
సాహిత్యము, సంగీతము,
నృత్యమును హావభావ
ములు గూడిన నటనమ్మును,
నవరసములు, వేదశాస్త్ర
పాండిత్యము సమ్మిశ్రిత
మును నొనర్చి, ప్రేక్షకులను
ఆనందపు తన్మయత్వ
మున నూయల నూపునట్లు
'హరికథావిధాన' మనే
నూతనప్రక్రియను సృష్టి
జేసి తాను తన అంతట
తాను గాను దాని అను
ష్ఠించి ఆచరణలొ పెట్టి
అది ఎంతో విజయవంత
మును శుభప్రదమ్ము అయిన
ప్రక్రియగా, విజ్ఞు లంద
రామోదము నొంది అనుస
రించు రీతి హరికథలను
లోకంలో విఖ్యాతము
చేసిన సాక్షాత్సరస్వ
తీమూర్తియే ఆదిభట్ట
నారాయణ దాసుగారు.
దాసుగారి వంశంలో
జననమంది, వారికి మ
న్మడుగ మంచి పేరును ప్ర
ఖ్యాతి గడించిరి శ్రీ క

________________________________________________________________________________

ఉపాయనలు

851