పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/847

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వృద్దవయసు వచ్చు వరకు
పొంద రెపుడు ప్రావీణ్యం.
లావణ్యల మార్దవాన్ని
లఘువొనర్చు ప్రేమ ఎంతొ
స్త్రీల ప్రేమ బాణమ్ము
అద్ది బీజ మెపుడు కాదు.
మనుజ శరీరమ్ము రథము
రథికుడాత్మ సారథియౌ
బుద్ధి ఇంద్రియాలు ఆశ
గణము, మనసు కళ్లియమ్ము
నదులు ఏవిధాన నామ
రూపాదుల వదలి జలధి
లోన లీనమౌతాయో
అట్లె జ్ఞాని విశ్వేశ్వరు
లోన లీన మౌతాడు.
కామము నుద్దీపించెడు
నేత్రదృష్టి భేదమ్ములు.
వక్షోజపు " కాఠిన్యము
సూక్ష్మమైన మధ్యమ్ములు[1]
స్త్రీ జాతికి ముఖ్యంగా
నట్టువ[2]లకు ఎంతగానో
అందానికి పోషకాలు.

—♦♦♦♦§§♦♦♦♦—

నాభిలోతు[3] అయిన స్త్రీకి
మదనరసము అధికమంటు
కాళిదాససుకవి మేఘ
సందేశంలో తెలిపెను.

—♦♦♦♦§§♦♦♦♦—

నారదుండు పంచచూడ
అనెడి దేవతావనితను
స్త్రీ స్వభావ మెట్టిది అని
ప్రశ్నిస్తే పరపురుషుల
గవయగోరుటయు మొదలౌ
లక్షణాలు తెలిపె నామె

—♦♦♦♦§§♦♦♦♦—

నర్తకీ కుచద్వయమ్ము"
ఆమె కంఠహారమ్మును
మించిన మూల్యమ్ము కలది...

—♦♦♦♦§§♦♦♦♦—

దూర్వాస మునివరుడు
ఒక మౌనిపుత్రికను
కందళిని మోహించి
భార్యగా నర్థించె
ముని ఒసంగిన పిదప
దూర్వాసఋషి పుచ్చు
కొనియె నా సుందరిని
ఆ రూపవతి మహా
వాగ్దుష్ట కాన నా
యమ తిట్టుటకు కడగ
దూర్వాసఋషి వరుడు
కుపితుడై “భస్మమై
పొ" మ్మనుచు శపియించె
అప్పుడాయన తండ్రి
దూర్వాసు వేడుకొనె
ఆ మహాముని ఆమె

  1. మధ్యమ్ములు - నడుములు
  2. నట్టువ - నాట్యకత్తె
  3. నాభిలోతు - ఈ విషయాన్ని కాళిదాస మహాకవి మేఘ సందేశం ఉత్తర కాండ 22లో తెలిపినారు.

________________________________________________________________________________ {{rh| ఉపాయనలు | | 847}