మౌ జనకుని ఉపదేశమె
దాసుగారి సకల విద్య
లకు నిధానమై ఉన్నది.
దాసుగారి స్వరూపమ్ము
స్వభావమ్ము నెరిగినట్టి
వా రెవరైన నీ మహాను
భావు డెట్లు గురువులు కడ
శుశ్రూష నొనర్పంగా
గలడని అద్భుతపడెదరు.
తార్కికులలొ తార్కికుడుగ
వైయాకరణుల అందున
వైయాకరణుండుగాను,
మీమాంసకు లందున మీ
మాంసకుడుగ కవుల యందు
మహాకవిగా, గాయకులలొ
గాయకుడుగ వైణికులలో
వైణికుడుగ, నటకులలో
నటకుడుగా, హరిభక్తుల
అందున హరిభక్తుడుగా
తనదు విశ్వరూపత్వము
ప్రకటనగావించుకొనును
కావునన దాసుగారు
ఎవ్వని ప్రభు వనదగునా
ఎవని ఇచ్చ కడ్డులేదొ
ఎవడు సత్య స్వరూపుండొ
ఆ ఎవ్వడు అధికార
ణమ్మొ అఖిలమునకు నట్టి
"సర్వేశుని నాగురునిగ
నాశ్రయింతు" నన్నారు
సకలశాస్త్ర పాండిత్యము,
సకలకళా కౌశలమ్ము
బహుభాషా వేతృత్వము
ప్రతిభాతిశయమ్ముచేత
స్వయముగ సంపాదన నొన
రించుకొన్న అప్పటికిని
దాసుగారు తనను ఒక్క
భక్తుడిగా, ఒక భక్తిప్ర
బోధకుడిగ ప్రకటనగా
వించుకొనెను, “మేధాశ
క్తికిని, ధారణాశక్తికి
సహకరింప గురుముఖాన
కొన్ని యేండ్లు మహాశ్రమతో
తిరిగి తిరిగి చింతనమ్ము
చేస్తే గాని అవబోధము
గాని యట్టి కౌముది శ
బ్దేందు శేఖరాల వంటి
గ్రంథమ్ముల దాసుగారు
స్వశేముషీ విశేషాన
అవగతమ్ము చేసుకొనిరి
జీర్ణముగావించుకొనిరి”
అని మా గురుపాదులు శ్రీ
మహామహోపాధ్యాయులు
శ్రీ తాతా సుబ్బరాయ
శాస్త్రివారు చెబుతుండగ
మే మెంతో అత్యంతా
శ్చర్యమ్మును పొందినాము.
ఇది ఎలా సాధ్యమ్మని
ఇట్టి మహామేధావియె
________________________________________________________________________________
838
వావిలాల సోమయాజులు సాహిత్యం - 1