పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/837

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అట్లె నట్ట నడువీధియె
ఆదిభట్టు హరికథలకు
ఆటపట్టు అయిపోయెను
విద్యార్థులుగా తనకడ
కరుదెంచిన వారిని వి
ద్వాంసులుగా జేసి పంపు
టే గాదు తన లోగిట
తన వాకిట హరిదాసుల
కరచేతను వైకుంఠము
చూపినారు ఆదిభట్టు
శ్రుతి లయ లీరెం డాయన
ఉచ్ఛ్వాసము, నిశ్వాసము
ఆయన దౌ నెట్టి కూన
రాగమైన సామగాన
మౌతుంది. ఆడినతై
తక్క శివుని అద్భుతమౌ
తాండవమ్ము జగము సర్వ
మాయన సంగీతశాల
కారణజన్ములు నారా
యణదాస మహోదయులు.
త్యాగరాజు, నారాయణ
దాసు, మహాత్మాగాంధీ
ఈమువ్వురు యుగపురుషులు.
ఈ మువ్వురు పరమపదిం
చిన దినమ్ము పుష్య బహుళ
పంచమియౌటొక అపూర్వ
మౌ జ్యోతిషవిశేషమ్ము.

—♦♦♦♦§§♦♦♦♦—

46  శ్రీనారాయణభట్టా!
ఆదిభట్ట! మహాభట్ట!!
వేదాంత వ్యాకరణ మహా
విద్వాంసులు, పుణ్యమూర్తులౌ
పూజ్యులు ఓరుగంటి
నీలకంఠ శాస్త్రి వరులు
మిమ్ము గూర్చి తెలిపినవి
"దాసుగారి కుటుంబమ్ము
వేదవిజ్ఞ కుటుంబమ్ము
తండ్రి ఖ్యాతినొందినట్టి
సరస సుసాహిత్యమ్మున
పారంగతు డయినవ్యక్తి!
తల్లి వివేక మహా సం
పన్న అయిన విదుషీమణి!!
సహోదరులు వైదికలౌ
కిక విద్యా పరులు. వీరి
తలిదండ్రుల సత్ప్రవృత్తి
మహాభాగ్య విశేషమ్ము
చేతనె ఈ మహాభాగు
డవతరించి కారణజ
మ్ముండుగాను జనకుని కడ
నే తన విద్యోపదేశ
మయ్యె. అద్ది కావ్యపఠన
శ్రవణ మాత్రమేను. తల్లి
వద్దనె పౌరాణికాది
గాథాశ్రుతి 'ఉపదేశ మ
పేక్షంతే విద్యా స
త్పాత్రసంగతాః' అను న్యా
యమ్ము చేత నామమాత్ర

________________________________________________________________________________

ఉపాయనలు

837