పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/833

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పూర్ణంగా ఎరిగినట్టి
మహావ్యక్తి మీ రంటే
భక్తిపరులు శ్రీ యస్వీ
జోగరాయ మహనీయుల
లోమెదలిన సద్భావన
భావగభీరపు రేఖలు
శ్రీ జోగరాయ సుకవి
'నాయెఱు' కను మీదు ఆత్మ
కథను గూర్చి వ్రాసినట్టి
సంపాదక భూమికలో
తెల్పినట్టి విషయా లివి
"ఇది లోక మ్మెరిగి నట్టి
ఒక అలోకసామాన్యుని
ఆత్మోదంతమ్ము, అంత
రంగ ముగ్ద సంగీతము.
సంగీతము, సాహిత్యము
నృత్యమ్మను త్రికళా కుశ
లియు నాత్రిదశేంద్రులైన[1]
వారి పూర్ణ పురుషాయుష
జీవితాన చిత్రంగా
ఇద్ది మొదటి ముప్పదేండ్లు
పరిమితమై ఉన్నట్టిది.
ఆదేశ ద్రిమ్మరియు, సర
స్వతీప్రతినిథి అయిన ప్రచా
రకుని శేష జీవితమ్ము
నిత్య మనస్సన్యాసిని
నిరంతరము స్వస్వరూప
అనుసంధాన ప్రవీణు
డును విశ్రేయసోదర్క
సాధనా సుమార్గపుపా
ధేయమాత్ర సుగాంధర్వ
ధూర్వహుండు నిషధయోగ్యు
డైన దాసు నరుడై దిగి
వచ్చినాడు. శ్రీ నారా
యణుడై దివి కేగినాడు.
'దాస' సంజ్ఞ ఆయనచే
తన పేరుకు చివర కోరు
కొని చేర్చుకొనబడినది.
హరికి దాసుగానివారు
హరిదాసులు స్వామివారు
కారణజన్ములు వారలు
ఆదిభట్టవారు బ్రతుకు
గహనమ్మున వేసుకొన్న
బాటవేరు వారు నడచి
నట్టి నడకయే వేరు
ఆపార్టీ ఈపాటీ
అయిన వారి కది ఎంతో
దురవగాహ మైనతీరు
వారి వ్యసనలోపమ్మా![2]
ఆకసాన మసనము[3] లే
కుంటయేను. నీటికి ని
ప్పంటుతుంద! నిప్పును చెద
లంటుతుంద!. కారణజ
న్ముల స్వభావమునకు జెంది
నట్టివియో సరిహద్దులు
అవగాహన కొలబద్దల
కందునట్టివే కావు
శూరవరుల జన్మంబును

  1. త్రిదశేంద్రులు - దేవతల ప్రభువు దేవేంద్రుడు
  2. వ్యసన - సప్తవ్యసనములు
  3. మసనము - శ్మశానము త్రోవ


ఉపాయనలు

833