పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/831

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



కులపతితలు, పుంశ్చలులు[1]ను "
రూపాజీవలును నైన
వారిమీద మీ కెంతో
అధికమైన దాక్షిణ్యం
ఇట్టివారిలోన మీకు
ఎవరిమీద కక్షలేదు.
భక్తిని అందించి వారి
పుణ్యజనుల జేస్తారు.
మనసులోని మాలిన్యం
ప్రక్షాళనచేసి వారి
గోపికలను గాగ మార్చి
బృందావనపుణ్యలోకు,
పురుషోత్తము జూపింతురు
సేవా పద్ధతులేవో
చిత్తానికి అనుగుణముగ
చెప్పి చేయనేర్పుతారు.
భక్తి ముదిరినట్టి కొంత
కాలానికి అట్టివారి
వైతరణిని దాటజేసి
వైకుంఠం చేర్చుతారు.
పతితులైన వారి నుద్ద
రించటమ్మె లక్ష్యమౌట
ధర్మకార్యములలో మీ
దర్శకత్వ మత్యధికము
కావ్యశిల్ప సమ్రాట్టులు
మీరే లిఖియించు కొన్న
కథను జెప్పు సమయాలలో
ప్రతిఘట్టం నైజంగా
ముగ్ధంగా, మోహనంగ
కథవిషయంలో నడుపుతు
వర్ణనలతొ, విషయాలతొ
మధ్య మధ్య ప్రత్యేకత
ఉన్న అట్టి కన్యాదే
వాలయాన్ని లక్ష్మణదే
వాలయాన్ని, పరశురామ
ఆలయాన్ని, ఆంజనేయ
ఆలయాన్ని, మూషికదే
వాలయాన్ని, అత్తాకో
డళ్లఆలయాల, తుదకు
అయహోలీ ఆలయాల
కోణార్కపు ఆలయాల
మానసికంగా చూపుతు
సామాన్యజనం చేతను
కాశీరామేశ్వర యా
త్రలు చేయిస్తారు మీరు
మధ్యస్థుల బుద్ధికి తగి
నట్టులుగా మేధావులు
శ్రీహరి, శంభో మొదలౌ
శబ్దార్థమ్ములు వివరిం
చేటప్పుడు సక్రమంగ
ద్వైతాద్వైతముల, విశి
ష్టా ద్వైతము లెరుకపరచి
ఆధ్యాత్మిక జ్ఞానమును
ఆ విదేహముక్తి విశే
షాల నర్థవంతంగా
జిజ్ఞాసతో బోధింతురు
భక్తిభావ సంభరితులు
అయిన శ్రోతలనే కాక

  1. పుంశ్చలి = రంకులాడి

________________________________________________________________________________

ఉపాయనలు

831