42 సంగీతకళాశారద!
నవ్యరాగఘననీరద!!
ఓనారాయణభట్ట!
నూత్నరాగములను దిట్ట!
'దశవిధరాగనవతికుసు
మాంజలి' పీఠిక వ్రాస్తూ
గానకళా మహనీయులు
మీ రనగా కడుభక్తులు
నూకల సత్యన్నారా
యణ తెలిపిన విషయాలివి
“దాసుగారి రాగమాలి.
కాప్రబంధమును వల్లెన
వేసి నిత్యమును సాధన
చేసినట్టివారి కసా
ధ్యమ్ము అయిన విషయ మేది
సంగీతమ్మున గానీ,
తాళ విభగాన గాని
ఉండదనుట అతిశయోక్తి
కాజాలదు. విద్యార్థుల
కీమాలిక బోధిస్తే
మొదటి రాగమును నేర్చుకొ
నేటప్పుడు విద్యార్థిగ
నున్నవాడు నూటెన
భయ్యో రాగమ్ము చేర్చి
పాడగలిగినట్టివాడు
విద్వాంసుడు రూపొం
దును అన్నది నిర్వివాద
మౌ నంశము దాసుగారి
పంచముఖీ షణ్ముఖి అను
ఆ అపూర్వ రాగతాళ
ప్రబంధాన్ని ప్రశంసిస్తు
పంచముఖిని ప్రదర్శించు
విద్వాంసులు నేడు ఒక్క
రో ఇద్దరొ మాత్రమ్మే
ఉన్నారు... అట్టివారి
ప్రోత్సహించి, వారిచే ప్ర
దర్శనాని కేర్పాటును
చేయించుట మన బాధ్యత
దాసుగారు సంగీతా
నికి, సంగీతాత్మకమౌ
లయశాస్త్రానికి అనేక
పరిశోధన లాచరించి
గానకళకు సం సేవన
సలుపుటందు మన కాద
ర్శప్రాయులుగా ఉండిరి.
కొందరైన పంచముఖిని
సాధనగావించి ప్రద
ర్శించినచో దాసుగారి
రచన సార్ధకమ్మౌను”.
43 ఓ నారాయణభట్టా!
ఆదిభట్ట! భట్టభట్ట!!
విద్యావతి మీరు గాఢ
ముగను ప్రేమతోడపిలిచి
వారసురా లవుటచేత
“స్వయంలేఖ” నాన్ని లిఖిం
పగజేసిన లేఖకురా
లౌ శ్రీమతి రాజేశ్వరి
ఒక సందర్భమ్మునందు
________________________________________________________________________________
ఉపాయనలు
829