పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/828

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఈయన గానమ్ము దాక్షి
ణ్యాత్యగానమును పోలదు
ఉత్తరదేశపుగాన
మ్మును బోలదు ఈ గానము
అన్నింటిని కలియద్రొక్కి
పెట్టినట్టి కాషాయము
గాయ మందు నేను. ఈ
యనకు కవితయందొక్క వి
శిష్టస్థానమ్ము నీయ
కను తప్పదు. ఈయన కీ
ర్తనల గానమొనరించెడు
సమయమ్మున విన్న నాకు
ఆ కవిత్వమందును,
గానమ్మం దున్నయట్టి
మాధుర్యముచే కంఠో
పాఠము చేయాలనియెడు
బుద్ధి పుట్టుతుంది
హరికథకులలోన ఇట్టి
సన్మానము పొందినట్టి
వారుగాని ఇంత నిరా
ఘాటంగా వర్తించిన
వారు గాని, ఇట్టి శిష్యు
లను తయారుచేసినట్టి
వారు గాని ఆంధ్రదేశ
మందె కాదు ఇతర దేశ
ముల అందున లేరని యే
స్పష్టంగా చెప్పవచ్చు
ఈయన సంస్కృతము లోన
రచియించిన గ్రంథము పం
డితులెల్లరు శిరసావహి
యించినదిగ ఉండుటచే
నిరాఘాట ప్రజ్ఞ గల్గి
నట్టివాడు అయినప్పుడు
మాతృభాష అయిన తెలుగు
లో నీయన కొక్క గురువు
ఉండవలసి ఉంటుందా?
ఈయనతో పోల్చటాన్కి
నాకు తెలిసినంతమటుకు
ఏ ఒక్కరు, ఏమాత్రం
గోచరించటమ్ము లేదు.
బ్రతుక దగిన కాలమంత
బ్రతికి, కులము వన్నె కెక్క
జేసి తన్ను తెలిపి మిన్ను
కరిగినాడు సోదరుండు
పేరిదేవు చూడ గోరి.
నారాయణదాసు ప్రజ్ఞ
ఆ అనన్వయాలంకా
రానికి తొలి లక్ష్యమ్ము”
తిరుపతి వేంకటకవీంద్రు
లిరువురిలో పెద్దవారు,
కవిచంద్రుల కెందరికో
గురువర్యులు, అవధానశి
రోమణులకు రారాజులు,
పాండవనాటకకర్తలు
సుప్రసిద్ధ విద్వాంసులు
“చెళ్లపిళ్ల” మిమ్ము గూర్చి
నిష్క్రమణ చేసినపుడు
తెలిపినట్టి విషయము లివి.

________________________________________________________________________________

828

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1