తమ్మును, సాహిత్యమ్మును
నైజమ్మౌ పాండిత్యమె
కాని ఒకరివద్ద నేర్చు
కొన్నది గాదని చెప్పిరి”
—♦♦♦♦§§♦♦♦♦—
41 నారాయణదాస సుకవి!
సంగీత కళాకోకిల!!
"నిన్న మొన్న కీర్తిశేషు
లైన జగద్విశ్రాంతను
కీర్తిమూర్తు లైన హరిక
థాప్రథమావతారు లౌ
నారాయణ దాసుగారి
గృహనామము "ఆదిభట్ట".
భట్టశబ్దమా పండిత
వాచకమ్ము. 'ఆదిభట్ట'
వారిలో 'అజ్జాడవారు'
ఎంతో విశిష్టులు అంటూ
తెలియనౌట “ఆదిశ్చా
సౌ భట్టశ్చ ఆదిభట్ట”
ఆదిభట్ట వంశము నా
రాయణవంశమ్ము గాను
కీర్తికెక్కుటకు నారా
యణదాసులె కారణమ్ము.
భావికాలమున ఈయన
నారాయణునకు దాసుడు
అయితీరును. శ్రీ ప్రహ్లా
దాది పరమ భక్తులలో
ఒక్కడుగా పరిగణింప
దగ్గవాడు కాగలడని
తెలియుటచే నారాయణ
నామధేయ మీయన కా
తలిదండ్రులు పెట్టియుంద్రు.
బాహ్యవర్తనమ్ము ఎదో
రీతిగాను కనబడినను
అంతరంగ మతినిర్మల
మైనట్టిది. భక్తుడంటె
నారాయణ దాసుగారు
అంటు నేను బాహులెత్తి
అతిదృఢముగ చెప్పగలను.
చదవకుండగనె సమస్త
విద్యల సాధించినాడు
మాతృగర్భమందె మధుర
సంగీత కవిత్వమ్ముల
సాధన గావించినాడు.
"ప్రపేదిరే” తో మొదలౌ
కాళిదాస కవీశోక్తి
ఈయన ఎడ అన్వయించి
నట్లుగ ఏ మరిఒక్కరి
అందు అన్వయింపబోదు!
ఇతని జన్మవంశమునకు
చెందినట్టి జ్ఞాతుల కం
టే విద్యావంశానికి
చెందినట్టి జ్ఞాతులె వి
స్తారంగా ఉంటారు
ప్రస్తుతాంధ్రలోకంలో
హరికథ చెప్పే ప్రతివ్య
క్తియు ప్రత్యక్షముగానో ప
రంపరగానో ఈయన
శిష్యులు అయి తీరవలెను.
ఉపాయనలు
827