నారాయణదాసు గారి
సారస్వత నీరాజన2
గ్రంథమునందున వారల
నీరాజన లర్పించిరి
అందులోన “చెళ్లపిళ్ల”
మానాప్రగ డింటిపేరి
శేషశాయి యామిజాల
పద్మనాభ శాస్త్రియు, ఆ
శ్రీనివాస శిరోమణియు
మూలా పేరన్న శాస్త్రి
దివాకర్ల రామమూర్తి
దివాకర్ల వేంకటావ
ధాని, ఓరుగంటి నీల
కంఠశాస్త్రి, శ్రీస్థానం,
శ్రీమామిడిపూడి వారు,
గంటిజోగి సోమయాజి,
శ్రీ వేదనభట్లవారు,
శ్రీమాన్ పెద్దింటి సూర్య
నారాయణ దాసవర్యు
లమ్ముల భాగవతారు
కరుణశ్రీ పాపయార్య
వావిలాల సోమయాజి,
శ్రీ శంభర బొడ్డుపల్లి
శ్రీ యమ్ ఆర్ అప్పారావు
శ్రీ యస్ వి జోగారావు
కఱ్ఱా ఈశ్వరరావు
ఇత్యాదులు విజ్ఞానులు
ఎందరోను ఉన్నారు.
—♦♦♦♦§§♦♦♦♦—
36 హరికథలకు ఆదిభట్ట!
గేయఫణితి కాదిభట్ట!!
నాట్యకళకు ఆదిభట్ట!!
లోకగతుల కాదిభట్ట!!
విజ్ఞులేమి, అజ్ఞులేమి
విపులమైన లోకంలో
మిమ్ము ప్రశంసించు రీతి
మీ విజ్ఞానాధిక్యత
మీదు కళాపాండిత్యము
ఇత్యాదుల గూర్చి ఏమి
చెప్పుకుంటు ఉన్నారో
వానిలోని కొన్ని భావ
ములను సేకరించి, వాని
లోనకొన్ని సంగ్రహించి
భక్తజనావళి కొరకు
మా కొరకు, మీకొరకు
గానయోగ్య ఛందస్సులో
నేను తెలుపబూనుకొంటి
శిష్టువైన ఓ భట్టూ!
శ్రీనారాయణ భట్టూ!
స్వీకరింప వేడుచుంటి
కళాతపస్వులలొ, విద్యా
మహిమాఢ్యులలో, ఉపాస
కులలోనను నాదబ్ర
హ్మానుస్సంధానపరుల
లోన నవనవోన్మేషము
నొందు కళా సృష్టికారు
లందున, బ్రహ్మర్షులలో
తొలిపీఠ మొసంగదగిన
822
వావిలాల సోమయాజులు సాహిత్యం - 1