పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/819

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ఆడు టెట్లో నేర్పినారు!!
అనంగనృత్యముల[1] యందున
అనుపమ ప్రజ్ఞాన్వితలౌ
“నంగనాచు"[2] లెందరొ మీ
పాద సేవికలు శిష్యులు!!
పూర్వరాగ, విప్రలంభ
సంభోగము లను విభేద
ముల దక్షిణ నాయకత్వ
రీతు లెరిగినట్టివారు.
గణికలలొ అగ్రగణ్య
లైనవారు భక్తురాండ్రు!
“దేవదాసి” అన్న పేరు
నార్జించిన అట్టివారు
తిరు కళ్యాణోత్సవాల
ఆర్జించిన సేవలలో
శ్రద్ధాసక్తుల పాల్గొన
శ్రవణము, కీర్తనము, కేళి
ప్రేక్షణమ్ము[3], గుహ్యభాష
ణమ్ము[4], సంకల్పోద్భవమ్ము
క్రియా నిష్పతన[5] మగ్నత[6]
లను నెనిమిది మైధునాంగ
ములను పిదప మీరు తెల్ప
నవవిధ శృంగారములను
మధురభక్తితోడ నేర్చి
భర్తనుగా జేర్చుకొన్న
భగవంతుని మరులకొల్ప
నగరిలోని ఆలయాల
శృంగారము లభినయించి
వీరాంగనలు గా వర్తిలి
రతిపరవశు గావింతురు.
అనతికాలమందే వారు
స్వామివారి సన్నిధాన
సేవ నొందగా గలరు?
దేవదాసి భక్తురాండ్ర
అందును మీ శిష్యురాండ్రు
ఉన్నారో శుద్ధభట్ట.

—♦♦♦♦§§♦♦♦♦—

34  ఓహో ఓ మహాభట్ట!!
ఆహాహా శుద్ధభట్ట!!
దేవదాసి ఒకతెకు ఆ
దీక్షాగుణ లక్షణాన్ని
అవసరమౌ జ్ఞానమ్మును
అభినయ సంక్లిష్టతలను
నాట్య గాన క్లేశాలను
అవగతమ్ము గావింపగ
అభ్యర్థన జేసినపుడు
దృఢతర సద్భావనతో
శిష్యురాలిపై ప్రేమతొ
దేవదాసి రూపంతో
స్వయంగాను అభినయిస్తు
చూపి నేర్పగావలె నని
దేవదాసి వేషానికి
తగినట్లుగ మిమ్ము మీరు
అందంగా దిద్దుకొనిరి
కబరీ వైచిత్య్రాల[7]తో
శ్రవణ కంఠ నాసికాదు
లకు యోగ్యములౌ నగళుల[8]

  1. అనంగనృత్యము = అంగములేనివానికి (మన్మథుడు) చెందిన నృత్యము
  2. నంగనాచు = ఏమియు తెలియనట్టుండి ఘనముగా కామ(మదన) నృత్యము చేయగల దిట్ట
  3. ప్రేక్షణము = వీక్షణము
  4. గుహ్యభాషణము = రహస్య సంభాషణము
  5. నిష్పతనము = పనులలో నిమగ్నమగుట
  6. మగ్నత =లీనమగుట
  7. కబరీ వైచిత్య్రాలు = చెదరిన జుట్లముడుల వింతలు
  8. నగళుల = అంతఃపురముల

________________________________________________________________________________

ఉపాయనలు

819