జీవితాన్కి, శీలానికి,
శ్రేయానికి చెందినట్టి
ఎన్నో నేర్పిన గురువులు!
మీకడ కడు భక్తితోడ,
శ్రద్ధతోడ విద్యనేర్చి
మేధ్యామేధ్యమ్ము[1]లెరిగి
ధనసంపద, దారిద్య్రా
లకు గల్గిన మంచి చెడుల
తరిచి తెలుసుకొన్న వారు
మంచివైన అలవాటుల
నేర్చియు తమ బిడ్డల కం
దీయనట్టివారి మంద
లించి తెలియజేస్తారట!
దైహికముగ మానసికం
గాను మీరు పలురీతుల
ఆర్జించిన పరిశుద్ధులు.
సంస్కారానికి చెందిన
స్వల్పమైన ఏ అంశం
మీ దృష్టిలొ పడకుండా
తప్పించుకొ పోయినట్లు
చెప్పటమ్ము కనుపింపదు.
31 శ్రీనారాయణదాసా!
వేశ్యలలో కుంభదాసి[2],
రూపాజీవ[3]యు గణిక[4]యు
-మూడు భేదముల వారితొ
మీకు పరిచయమ్మున్నది
మువ్వురకును తగినవిద్య
చెప్పి వారి స్థానమ్ముల
ఉన్నతములు గావించిరి.
నీరు పల్లమెరిగి నట్లు
వారు మిమ్ము ఎరిగినారు
"ఉన్నదేమొ ఇచ్చుకొందు
మయ్య స్వామి! విద్య నేర్పి
బాగ బ్రతుగకల్గునట్టి
అవకాశము దయతో క
ల్పింపుడయ్య, అంటు వేడ
అద్ది మీకు ధర్మమ్మను
భావముతో ఒప్పుకొని
వారిలోన శారీరక
సౌందర్యం పురుషజాతి
కమ్ముకొనే అంగనలకు
నగ్న రూప దర్శనాల
రతి విభేద లక్షణాల
వారిలోన తగినవారి
కించించుక నృత్యగాన
కళలు నేర్ప నేర్చి వారు
నైపుణ్యంతో రసికుల
రంజింపంగా గలిగిరి.
జీవితాన ఉత్తమమౌ
స్థాయి చేర గలిగినారు.
కొద్దికాలమందే వారు
సంస్థానాధీశుల సభ
లందుజేరి పెద్దవారు
వీక్షింపగ నాట్యగాన
కళ లందున ప్రావీణ్యం
చూపుకొంచు మెప్పువడసి
సన్మానము నొందినారు.
—♦♦♦♦§§♦♦♦♦—
- ↑ మేధ్యామేధ్యము = శుద్ధ, అశుద్ధములు
- ↑ కుంభదాసి = వేశ్య ఇంట జలకుంభాన్ని, పాన కుంభాన్ని ప్రియులకడకు చేర్చే కన్య
- ↑ రూపాజీవ = అందముతో జీవించు వేశ్య
- ↑ గణిక = వేశ్యాగృహ యజమానురాలు
________________________________________________________________________________
ఉపాయనలు
817