పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/816

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



నిత్యము లేమీ చేష్టల
నిర్లక్ష్యం కనుపించదు
సర్వ విషయముల యందున
సత్యసమ్మతము భావన!
పక్షపాతవైఖరి ఎట
పరికించిన కానరాదు
క్రీడగనైనాను మీరు
కించపరచ రెవ్వరినీ
దళితుల ఆక్రందన విని
దారుణ విస్పందితులై[1]
తప్పించుకొ తిరుగువారి
తట్టి, ఎంతొ హెచ్చరించి
ప్రక్కచేర్చి "పీడితాళి
బాధలన్ని తీర్చునట్టి
ప్రగతిశీలు రయ్యమీరు!
ఎట వసించుచున్న నేమి?
ఏమొనర్చు చున్న నేమి?
ఉత్సాహము కల్గించుట
ఉత్తేజితులను జేయుట
మీకు జన్మలక్ష్మణమ్ము!
నే నన్నది సత్యమ్ము!!
ఇంతు లొక్క కొంతమంది
ఎంతొ భక్తి భావంతో
ఎంతొ మహాశ్రద్ధతోడ
ఏ వత్తిళ్లకు లొంగక
ప్రముఖమార్గముల విద్యల
పరమకరుణ బోధచేయ
ప్రౌఢవిజ్ఞు లైనారు
కాంతలలో నొక కొందరు
మీ ప్రోత్సాహంవల్లను
మేటి కథాకథన లైరి
భక్తితోడ హరికథలను
జనము మెచ్చ చెప్పినారు
సన్మానము లందినారు

—♦♦♦♦§§♦♦♦♦—

30  శ్రీశారద అవతార!
ఓ నారాయణ దాసా!!
బాల్యక్రీడాసక్తత
చిన్నలలో చిన్నలుగా,
కూలంకష ప్రతిభా పాం
డిత్యాలతొ పెద్దలలో
పెద్దలుగా తగినట్లుగ
లీనమౌతు దేశమంత
పర్యటించి భారతీయ
ధర్మమ్మును, సంస్కృతులను
సర్వ వర్ణముల వారికి,
సర్వ వర్గములవారికి
కథాకథన పద్దతితో
రమ్యంగా బోధించిరి.
పరప్రాంతాలకు చెందిన
నూతన గాన-ఔత్సాహికు
లైనవారి కెన్నెన్నో
రహస్యాలు దెల్పి వారి
జిజ్ఞాసుల జేసెదరు!
హరికథలను జెప్పునట్టి,
హరికథలను నేర్పునట్టి,
హరిదాసులె కారు మీరు

  1. విస్పందితులు = విశేషముగా చలించువారు

________________________________________________________________________________

816

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1