పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/814

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ఇష్టదైవమునకు తావు
వైకుంఠమొ, కైలాసమొ
అన్యమ్మో తెలిపి, ఆటకు
పంపుతారు, లేకపోతె
జ్ఞానులుగా తీర్చిదిద్ది
బ్రహ్మీభూతుల జేతురు.

—♦♦♦♦§§♦♦♦♦—

27  పరమభక్త! మహాజ్ఞాని!!
ఓ నారాయణభట్టా!
'శంభో' అను ఆలాపన
'గోవిందా' అను స్మరణం.
చేసుకొంటు బహుభాషా
నేతృత్వము వహియించిన
అట్టి మీరు వృద్ధాప్యము
వృద్ధి అయిన గ్రంథరచన
అధికమ్మై నట్టివేళ
ఒక శిష్యుడు చనువుతోటి
"ఓ బాబూ! కథచెప్పే
నైపుణ్యం నేర్పు" డన్న
వెనువెంటనే నేర్పబూని
"ఒరే శిష్య! నన్ను ఎపుడు
చూస్తుండుము నా మాటను
నా తీర్పును చూస్తుండుము”
అని అంటే దాన్ని గొప్ప
ఉపదేశంగా గ్రహించి
ఆ శిష్యుడు శ్రద్ధతోటి
పది ఏడులు ఏకగ్రీ
వముగ మిమ్ము చూచినారు.
మీ పదసేవన యొనర్చి
తరియించిన దాసశిష్యు
నకు మీరలు వ్రాసుకొంటు
మధ్య మధ్య స్ఫురణకు వ
చ్చిన అద్భుతవిషయాలను
వచియిస్తూ, గానము గా
విస్తు అభినయోచితముగ
లాస్య తాండవ ప్రజ్ఞల
తెలిపినారు చూపినారు
ఇన్ని శక్తు లేకత్రా
ఎవరి అందు ఉంటాయి.
ఈ శిష్యాగ్రేసరునకు
ఈ భక్తాగ్రేసరునకు,
సహకరించి కథాకథన
నైపుణ్యం నేర్పునపుడు
పూజ్యమూర్తు లయిన మీరు
శారద వలె, గణపతి వలె
విష్ణువు వలె పలుమారులు
దర్శన మిచ్చారు భట్ట!
ఆదిభట్ట! మహాభట్ట!
భద్రభట్ట!! ఈ శిష్యులు
“శ్రీ సద్గురు సన్నిధాన”
కర్తలైన శ్రీ వేదన
భట్లవారు' భట్టభట్ట!!

—♦♦♦♦§§♦♦♦♦—

28  ఇట్టిశిష్యులను మీరలు,
'నారాయణదాస భట్ట!!
పరమేశ్వర రమ్య రమ్య
విపణులందు భక్తి విషయ
వస్తువులకు లోకానికి

________________________________________________________________________________

814

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1