పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/811

ఈ పుట అచ్చుదిద్దబడ్డది





మర్దని' అని ఖ్యాతి నొందె.
'త్రికళ' లోని మాహేశ్వర
శక్తియు నొక ఏకవీర,
'రురుడు' అనే అసురు జంపి
చర్మ రక్తముల రెంటిని
వేరు చేయటమ్ము వల్ల
'చాముండీ' అను ప్రసిద్ధ
నామమ్మును పొందెనీమె.
అప్పుడప్పు డవసరమ్ము
అయినప్పుడు బ్రహ్మశక్తి
యే కాదు, విష్ణుశక్తి
శివశక్తియు అద్భుతముగ
కానుపించు గాన నేను
భావికాల లాభార్థము
నా శిష్యున కా కళలను
కూడ తెలియజెప్పినాను.

—♦♦♦♦§§♦♦♦♦—

22  హరికథా పితామహా!
ఆదిభట్ట! మహాభట్ట!!
నాలుగేండ్ల ఈడుననే
చదువులన్ని వాటి అంత
టనే మీకు అబ్బినాయి!!
[1] , 'మాటకాడు'
'ఆట పాట లందు మేటి'
అంటు మీరు పేర్వడసిరి.
ఏనా డైనాను ఎదురు
లేకుండా వేల వేల
మంది ప్రజకు గొంతును విని
పించినారు గజ్జె విప్ప
లేదు రేయి తుదివరకును
పాటపాడు "అందగాండ్ర
తలకట్టని” పేరుపొంది
నారు మీరు [2]
కాన్క లెన్నో అందుకొనిరి.
మైసూరుదొరేను మీకు
తోడాలను తొడిగినారు.
అంకినీడె మీ కాలికి
[3] వేసినాడు.
పదునెనిమిది యేండ్ల మొదలు
ఆట, పాట మాటలతో
బ్రతికినారు, భట్ట, మీరు
కన్యకుమారిక మొదలుగ
కలకత్తా వరకు మీరు
అరవము, మలయాళ, కన్న
డాలు, పైన బంగాలీ
తెలుగు సీమలందు మెప్పు
తెచ్చుకొన్నవారు మీరు
మంచి గూర్చి చెప్పేవేళ
[4] తప్ప ఇతరు
లెవ్వరినీ ఎచట నైన
గౌరవింప, కీర్తింపగ
[5] కారు.
చదువులెల్ల మీ అంతటె
నేర్చినారు మీ అడుగుల
నొత్తి విద్య నేర్చుకొంచు
వందలు మని నారిలలో
ఎనుబదేండ్ల వయసు వచ్చి
నపుడైనను మాటలాడు
వాండ్ర సాటిమీర మీరు

  1. 'లయకారుడు = నృత్యగీత వాద్యములను సమముగా ఉంచువాడు ’
  2. ఎకిమీడుల = ప్రభువుల , రాజన్యుల
  3. పెండేరం = గౌరవ సూచకమైన కడియము
  4. ఈవికాండ్ర = దానపరులను , దాతలను
  5. చీరికిగొనువారు = చీలికను పొందించువారు

________________________________________________________________________________

ఉపాయనలు

811