పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/810

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



వమ్ముతోడ వీక్షిస్తూ
ఉండంగా వారి చూపు
లకు పుట్టెను ఒక కన్నియ
అందగత్తె మహామాయ,
పేరు 'త్రికళ' ఆమెదేహ
మందలి వర్ణత్రయాన్ని
విభజించి ఇమ్మటంచు
కోరినారు. త్రికళదేహ
మందు నున్న బ్రహ్మశక్తి
శ్వేత పర్వతమ్ము జేరి
తపము జేసుకొనుచుండెను.
బ్రహ్మ అచటి కేగుదెంచి
కానుపించి తపము మెచ్చి
వరము కోరుకొను మనియెను.
"సర్వపదార్థముల యందు
నేను ఉండితీరునట్లు
వర మొసంగు డని అడిగెను.
"బ్రహ్మశక్తి" ప్రేమతోడ
ఆమెను తన శరీరమ్ము
లోనికి గ్రహియించె బ్రహ్మ
అక్షణమ్ము నుండి సృష్టి
వర్ధిల్లెను.

విష్ణునికళ
నారాయణి మహావైభ
వమ్ముతోటి "మందర" నగ
మందు నుండె. నారదుండు
అచటి కేగి ప్రణామమ్ము
లాచరించి ఆమె అంద
చందమ్ముల అమితముగా
ప్రశంసించె. "విష్ణుమూర్తి
మమ్ము స్వీకరింపకుంట
చిత్రమ్మే" అంటు వెళ్ళి
పోయినాడు.

అచటినుండి
నారదుండు మహిషాసురు
కడకు నేగి "మందర నగ
మందు మహాసుందర రూ
పమ్ముతోడ ఉంటున్నది
ఒక కామిని ఆమె వంటి
భామిని ఈ విశ్వంలో
ఏ తావున కనిపించదు.
ఆమె నీకు తగిన కాంత"
అంటు తెలియజెప్పినాడు.
మహిషాసురు డామెను కొని
రండని తన సేన లంపె
నారదుండు నారాయణి
కడకు మరల తిరిగి వచ్చి
"చూచావా మహిషాసురు
కావరమ్ము నిన్ను గోరి
సైన్యాలను పంపినాడు
నీవు తప్ప నితరు లెవ్వ
రా రక్కసు గెల్వలేరు"
అని చెప్పెను. మహిషాసురు
భటులు వచ్చినంత వారి
నారాయణి ధిక్కరించె.
స్వయముగానె మహిషాసురు
డపుడు వచ్చి యుద్ధము గా
వించి సంహరింపబడియె.
నారాయణి 'మహిషాసుర

________________________________________________________________________________

810

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1