పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/806

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



తనదు భర్త తన్ను చేర
దీయ మానెనేమొ అన్న
ఊహకలిగి పరమేశ్వరి
తీవ్రతపము గావించుట
జ్ఞాపకమ్మునకు వచ్చెను.

—♦♦♦♦§§♦♦♦♦—

15   భర్త శివుని, మనసు మార్ప
శక్తియుక్తి జోడొనర్చి
పరమతపము చేయబూనె
పార్వతి శివుకోసంగా
తీవ్రతపము చేస్తుంటే
ఆ తపోగ్ని భరియింపగ
రానిదయ్యె అవ్వేళను
బ్రహ్మాదులు శివుని తపో
భూమికడకు అరుగుదెంచి
పరమేశ్వరి స్వీకరింపు
మని కోరిరి. బ్రాహ్మణవే
షమ్ముతోడ శివుడు ఆమె
తపముచేయు స్థానమ్మున
కేగుదెంచి ఆహారము
పెట్టుమంచు అర్థించెను.

—♦♦♦♦§§♦♦♦♦—

16   నగపుత్రిక “నదిని స్నాన
మాడి రండు" అని అడిగెను.
బ్రాహ్మణుండు నదిలో దిగి
"మొసలి ఒకటి నన్ను బట్టె"
అంచు అరిచి లేవదీయు
మంచు నామె వేడినాడు.
లేచి ఆమె నదియొద్దకు
వెళ్ళె కాని పరపురుషుని
ముట్టు టెట్లు అని సంకో
చించుచుండె. అపుడు శివుడు
నిజరూపము చూపినాడు.
పూర్వజన్మమున అతడు
తనకు భర్తయౌట గౌరి
గుర్తించెను. పరమేశ్వరు
గూర్చి ఆమె తండ్రి అయిన
హిమవంతున కెరిగించెను
ఇంద్రాదులు తోడ్పాటుతో
సప్తర్షుల సాయంతో
హిమవంతుడు గౌరీక
ళ్యాణమ్మును సిద్దపరచి
అందరి ఆనందంతో
ఉత్సవమ్ముగా జరిపెను.

—♦♦♦♦§§♦♦♦♦—

17   కథాకథన చక్రవర్తి!
శారదావతారమూర్తి!!
గౌరీ కళ్యాణకథన
మైన వెనుక విషయమ్ములు
ఈ రీతిగ సాగినవి
గిరిజా కళ్యాణవేళ
గీర్వాణోచితములైన
ఆచారము లన్నింటిని
అబ్బబ్బా! అద్భుతముగ
గొప్పగాను తాము ఎంతొ
ఒప్పిదముగ జరిపించిరి.
శ్రోత లెంతో సంతృప్తితో
శుద్ధ బుద్ధి శోభిస్తూ
దూరమ్మున నుండి తమకు
వందనమ్ము లర్పించిరి.

________________________________________________________________________________

806

వావిలాల సోమయాజులు సాహిత్యం-1