యజ్ఞభూమి యౌ నియ్యది
అపవిత్ర మ్మయిపోవును
నా కుల గౌరవము చెరుప
గా శివు వరియించినావు”
అని పుత్రిని కోపించెను
పరమశివుని దూషించెను.
అపు డసిక్ని, తల్లి ఏమి
పలుకలేక శోకించెను.
తనను కోపగించుట అను
విషయము పట్టించుకొనక
పతి దూషణ వినజాలక
పతినే మది స్మరియిస్తూ
మరల జన్మ కలిగినపుడు
శివుడె భర్త ఔగా కని
మ్రొక్కి మహాయోగాగ్నిని
సృష్టిజేసి సతీదేవి
దేహమ్ము దహించుకొనియె.
తన-సతి సతి దేహ
త్యాగమ్మును ఎరిగి శివుడు
దక్షుడి యజ్ఞాన్ని ఘోర
ముగ ధ్వంసము గావింపను
వీరభద్రు పుట్టించెను,
జట నుండి అతడు శివగ
ణాలతోటి దక్షయజ్ఞ
వాటికకడ కేగి త్రొక్కి
యజ్ఞమును, యజ్ఞశాల
నాశనమ్ము గావించెను.
కొంతకాల మైనపిదప
శివుని పత్ని సతీదేవి
తదుపరిజన్మమ్ము నందు
మేనక గర్భాన పుట్టు
నగరాజగు హిమవంతున
కని విష్ణ్యాదులు అతని
గేహమునకు విచ్చేసిరి.
నారదుండు విచ్చేసెను
దైవజ్ఞుండగునాతడు
పుట్టనున్న సతీదేవి
అందచందములను దెలిపి
“నీ కుమార్తె పరమశివుని
పత్ని ఎంత అదృష్టమ్ము
నీ యది హిమవంతా!" అని
సంతోషము నొంద జెప్పి
నతుల నంది అరిగినాడు.
హిమవంతుడు, పర్వతరా
జధికదీక్ష తపమొనర్చి
తన వంశము విస్తరింప
జేసుకొనంగా దలచెను.
దేవతలందరు పితరుల
కడకు వెళ్లి "హిమవంతుడు
పెండ్లాడగ దలచినాడు.
ఇది అందరకును శ్రేయో
దాయకమ్ము అతడు మేన
కను పెండ్లాడుటకు మీరు
ఇండు" అని కోరిరి.
పితరులు అనుమతి మీదను
హిమవంతుడు పెండ్లి ఆడె
మేనకను. విష్ణ్వాదులు
దేవత లేతెంచినారు.
________________________________________________________________________________
ఉపాయనలు
803