యమునఁ బురారిఁ గెల్వగ భయానకలీల నెదిర్చి పోరఁడే!
పూ.చ. “విమతులఁ గెల్వఁగా వలె 'త్రివిష్టపరాజతనూజ! భక్తి న
స.
య్యమరులఁ గొల్చి తెమ్ము దివిజాస్త్రము లంచన నన్నయాజ్ఞను
త్తమతపమాచరింపఁగ 'పృథాసుత మధ్యము కైన నొంటిక
య్యమున 'పురారిఁ గెల్వగ భయానక లీల నెదిర్చి పోరఁడే!
భీష్ముని పెండ్లి కేగిరట పిన్నలు, పెద్దలు నెల్లవారలున్.
పూ.ఉ. “ఇష్మశరానువిద్ధు మనుజేశునిఁ దేర్పఁగ బ్రహ్మ చర్యతై
క్షోణష్మము, భీష్మమౌ ప్రతిన బూని యొనర్చుచునుండె దీనిని
గ్రీష్మ వికర్తన ప్రకర ఖేలన శుష్ముఁడటంచు మెచ్చుచున్
భీష్ముని - పెండ్లి కేగిరట పిన్నలు పెద్దలు నెల్లవారలున్.
స.
6
గజిబిజియయ్యె సంద్రము, ప్రకంపితమయ్యె హిమాచలేంద్రమున్.
పూ.చ. "భుజబల సంపదన్ తరువ భూరి హలాహల ముద్బవింపన
య్యజుడును, 'నిర్జరుల్ దనుజు లార్తిని వేడుకొనంగఁ, బూని నీ
రజనయనుండు మ్రింగుమన రాజశిరోజుఁడు మ్రింగనంతపై
గజిబిజి యయ్యె సంద్రము, ప్రకంపితమయ్యె హిమాచలేంద్రమున్.
జారులు పిల్తురమ్మ గిరిజాపతి వద్దనఁ డేగవే చెలీ!
స.
పూ.ఉ. "ఊరటలేని చిన్నదెడనున్నది స్వామికి నొంటిఁ దెల్పుకో
గోరుచు ముందు పంపెనని గొప్పగ నీ మరులెల్లఁ దెల్పితిన్
వారలనుగ్రహించిరి కృపాపరతన్ భయమందనేల? పూ
జారులు పిల్తురమ్మ! గిరిజా పతికాదనఁ డేగవే చెలీ!"
- 1.విమతులు: శత్రువులు
- 2.త్రివిష్టపరాజతనూజ: స్వర్గాధిపతి పుత్రుడు (అర్జునుడు)
- 3. వృధాసుత మధ్యముడు (అర్జునుడు)
- 4.పురారి: రుద్రుడు
- 5. ఇష్ము: కాముడు, వసంతుడు
- 6.అజుడు: బ్రహ్మ
- 7. నిర్జరులు: దేవతలు
- 8.దనుజులు: రాక్షసులు
- 9. నీరజనయనుండు: విష్ణువు
78
వావిలాల సోమయాజులు సాహిత్యం-1