పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/77

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స. కారాగారమునన్ ధ్వనించే నవురా! గంధర్వ సంగీతముల్ .

పూ.శా. “మీరేకప్పములీయఁ దెచ్చితిరి స్వామిన్ దైత్యరాజేంద్రునిన్
        జేర న్వచ్చినవారు తెల్పుఁడన విస్తీరమ్ముమై చూప వీ
        ణారావమ్ముల వింత వింతలగు విన్నాణాలు దేవద్విష
        త్కారాగారమునన్ ధ్వనించె, నవురా, గంధర్వ సంగీతముల్ .

స. కారాగారమునన్ ధ్వనించె, నవురా! గంధర్వ సంగీతముల్

పూ.శా. హేరంబంబున బంక్తి కంధరుడు లోకేశా! నినున్ గెల్వగా
       ప్రారంభించిన శక్తితర్పణకునై రాజర్షి శీర్షాళిపెం
       పారన్ వ్రేల్చెడు వేళ పాడుఁడని యాజ్ఞాపింప పౌలస్త్యు హ్రీం
       కారాగారమునన్ ధ్వనించె నవురా! గంధర్వ సంగీతముల్.

స. ఆజికి నిట్లనున్ పరుని యాలికి నిట్లను నర్థి కిట్లనున్.

పూ.ఉ. ఈ జగమందు లేరు సరి యెవ్వరు భండన సవ్యసాచి, అం
       భోజ విశాలలోచనల బుద్ధి కలంచు ననంగమూర్తి వి
       భ్రాజిత దాన కల్పకము రాయనభాస్కర మంత్రి సత్తముం
       డాజికి నిట్లనున్ పరునియాలికి నిట్లను నర్థికిట్లనున్.

స. రాతినిఁ గూడి పొందె నలరాయని ముద్దులపట్టి ప్రీతితోన్.

పూ.ఉ. “ఆతతశక్తి యుక్తుఁడగు కీన1 న్నతనున్ శిశుపాలు యఁగా
        బ్రీతివహించుటల్ దెలిసి, పెండ్లికి రమ్మని వార్త రుక్మిణీ
        కాతరనేత్ర పంప2 యదుకాంతుఁడు వచ్చి వధించి దానవా3
        రాతినిఁ గూడి పొందె వలరాయని4 ముద్దులపట్టిఁ5 ప్రీతితోన్.


1. అన్న: రుక్మి
2. యదుకాంతుడు: శ్రీకృష్ణుడు
3. దానవారాతి: రాక్షసరూప శత్రువైన రుక్మి
4. వలరాయని: మన్మథుని
5. ముద్దులపట్టి ముద్దుబిడ్డ

మధుప్రప

77