పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/75

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'సమస్యాపూరణం'

దత్తపది

(రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న - అన్న రామాయణ పరాలైన పదాలను భారతార్థ భావాన్ని గ్రహించి పూరించమని అడిగితే, దుర్యోధనుఁడు భానుమతితో, పద్మవ్యూహ సమయంలో అభిమన్యుఁడు, తమ కుమారుఁడైన లక్ష్మణకుమారుఁడిని అస్తమింపజేయటమనే భావాన్ని గ్రహించి ఇలా పూరించటం జరిగింది. )


శా. "మిత్రవ్రాత మనోభిరాముఁడయి సామీచీన్యయోధారిరా
    డ్తోత్రాభుగ్న మహోగ్రలక్ష్మణుడనై, క్రోధావతారంబుతో
    పుత్రుండుద్ధతయుద్ధ తంత్ర భరత ప్రోద్దూత సంరంభియై
    శత్రుఘ్నుండయి చేరె లక్ష్మణుఁడు భాస్వత్స్వర్గమున్ తన్విరో!”

గమనిక: రామః పశువిశేష (పెద్ద దుప్పి) జామదగ్శ్యే హలాయుధే రాఘవే చ అసితశ్వేత మనోజ్ఞఘత వాచ్యపత్ లక్షణం లాంఛనే నామ్ని రామభ్రాతః లక్ష్మణః అమరము భరత, శత్రుఘ్నపదాల ధాత్వర్థాలు గ్రహింపబడ్డాయి)


స. ధీరత్వంబున దోమ తుమ్మెఁగదరా దిగ్ధంతు అల్లాడఁగన్.

పూ.శా. "తోరంబౌ ద్రగడం బొనర్చియని కుద్యోపింప మేల్కొల్పినన్
        ఘోరాకారుఁడు కుంభకర్ణుఁడు మహాక్రోధంబునన్ లేచి, పొ
        ల్పారన్ మద్యము గ్రోలు వేళ్ళు ముకుఁ గోళ్ళన్ జేరి నర్తింపగా
        ధీరత్వంబున దోమ, తుమ్మెఁ గదరా దిగ్దంతు లల్లాడఁగన్.”

స. అందరు నందరే మఱియునందరు నందరె యంద రందరే.

పూ. ఉ. “అందరు సత్కళావిదులు నర్థివరించుట వ్యర్థ యత్నులై
         నందిమిఁ జూచి, కాచి జననాయఁక త్వన్నగరీ విలాసినీ
         మందిర వీధులందుఁ బలుమారుట పల్లవులాడ విందు" వీ
         రందరు నంద, రే మరియు నందరు, నందరు, అందరందరే!”


మధుప్రప

75