సత్యదర్శనం సులభమవుతుందని కవి ధ్వనిగర్భితంగా బోధిస్తాడు. ఈ కావ్యం చదివిన పాఠకుడికి విరహం, భయం, నిరాశా దైన్యాల మధ్య సామంజస్యం ఏర్పరుచుకుని ధైర్యంతో 'ఆశ' తోడుగా ముందుకు నడవాలనే సందేశం లభిస్తుంది.
దేవులపల్లి శ్రీశ్రీ ల్లా కాకుండా ఈ కవి తన కన్నీటిని, బాధకి చైతన్య స్ఫూర్తిని కలిగించి ముందుకు నడిపిస్తాడు. చూడండి.
సబ్‌కా నిచోడ్ లేకర్ తుం
సుఖ్‌సే సూఖే జీవన్ మేఁ
బర్సో ప్రభాత్ హిమకణ్ సా
ఆంసూ ఇస్ విశ్వ సదన్ మే
దీనికి వావిలాలవారి అనువాద పద్యం చూడండి :-
తే.
ఈ సకలముల రసము గ్రహించినీవు
స్నిగ్ద సుఖముచే మిగుల శుష్కించి యున్న
జీవితమున విశ్వసదన సీమ నుషసి
హిమ కణమటు నశ్రువులు వర్షింపు మువిద !!
ఏ అశ్లీలత లేని యీ వియోగ విరహగీతి కావ్యంలో గడిచిన ప్రేమ సంఘటనల్ని నెమరు వేయటం. ప్రేయసి వర్ణన, వియోగ బాధలున్నా జీవితాన్ని అర్థాంతరంగా ముగించని అత్మస్థైర్యంతో బాటు ఆధ్యాత్మిక రహస్యవాదం కూడా కనిపిస్తుంది.
మాదక్ థీమోహమయీ ధీఁ
మన్ బహలానే కీ క్రీడా
అబ్ హృదయ్ హి లాదేతీ హై
వహ మధుర్ ప్రేమ్ కీ పీడా||
అంటూ గుండెను చీల్చుకు వచ్చే ఆవేదనను శబ్ద మాధుర్యంతో వ్యక్తం చేస్తాడు. దీనికి వావిలాల వారి అనువాదం చూడండి:-
తే. మనసు నెదొ సంతస పరచుకొనెడు క్రీడ మాదకమ్మయ్యెను - విమోహమయము నయ్యె అట్టి మధుర ప్రణయ వేదనానిలమ్మె యెడద నిప్పుడీ గతిఁ గదిలించివేయు !! కన్నీరు 687