పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/550

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రద్ధ యటలేదు మనుమహాశయుని సుప్త భావము లవెల్ల మేల్కొన్న పగిదిఁ దోఁచె. తే. దృష్తివాసన బలిసి గర్జింపసాగె తే.

“ఎవరి యుల్లాసము సముజ్జ్వలింపవలెనొ వేరుగా నామె యట నుపవిష్ట యయ్యె ఎందులకు నిది యెల్ల? మరెందు కిద్ది. చెలఁగి మజ్జీవితంపు సంచిత సుఖమ్ము రమ్యరూపమ్ము నొందె నీ రమణియందు నట్టి యామెతో నెట్టు లే ననఁగలాఁడ 'నీవు నా దాన' వంచు నా యెదను విప్పి.” తే. సఖియ ఆమె కాలేదు ప్రసన్నురాలు శుభ్ర మెదొ రహస్య మ్మిట సునిహితమ్ము ప్రాణములఁ బాసి యాయజ్ఞ పశువు సౌఖ్య మునకు నాటంకమగుచుఁ దా మనునో యేమొ! తే. - అలిగినది శ్రద్ధ - ఇప్పు డే నయిన నట్టి యలుక సవరించి తేర్చఁగా వలసియున్నె? మానమును వీడి యామెయే మార్గమునకు వచ్చునా? లేక ఏ నెట్లు మెలఁగవలయు? తే. అంత మనువు పురోడాశ మారగించి సొగియఁగా మానసము త్రావె సోమరసము ప్రాణసంచయ రిక్తాంశపాళి నెల్ల మాదకత్వమ్ముతోడ నింపఁగను సాగె. తే. స్నిగ్ధతా ముగ్ద మౌ గిరి శృంగ వీథి సంజవేళను ధూసర చ్ఛాయలోన గగన మలిన శశాంక రేఖను ధరించి యపుడు చెన్నొందియుండె దిశాంతమందు. 550 35 40 వావిలాల సోమయాజులు సాహిత్యం-1