పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/455

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మహాయజ్ఞం


1



ప్రపంచ మంతట పరంపరాకం
విపంచి కింతట వసంతరాగం:
ఆహవకర్త - ఆహవభర్త ఎవడో ఎవడో మరి
ఎవడెవడో - ఎవరెవరో
ప్రపంచ మంతట పరంపరాకం
విపంచి కింతట వసంతరాగం

కులగిరులే హోతలుగా నుద్దాతలుగా
విధిదర్శన నేతలుగా,
ఋక్షఋషభకోలాహలమే
ఋత్విక్కుల రోమంధముగా
సముద్రఘోషల సామధేనితో
హాహాకార స్వాహాస్వనముల,
ఆత్మల హేషల ఆమంత్రణముల -
స్రుక్సువమ్ము లీదిక్కులు నాలుగు
హవ్యకవ్యములు, ఆమీక్షమ్ములు,
సాన్నయ్యమ్ములు, చరుపరమాన్నము
లర్కారాజన ఆత్మ దేహములు
ఉపాకృతమ్ములు, వషట్కృతమ్ములు,
కృపాతిరస్కృత కృశానతేజులు
స్థండిలమండిత చండానలునకు
అపవిత్రాశయ ధవిత్రములతో
స్వేదాంకురముల, చిదిమేసేస్తూ

______________________________________________________________________________________

గేయ కవితలు'’’

455