పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/428

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దిగివచ్చినాడు క్రొత్తగా వచ్చినాడమ్మ
రారమ్మ రారమ్మ రారమ్మ రారమ్మ
ఓ తెనుగు పూలార! ఓ యనుగు పూలార!!


4.

అమర లోకమునుండి అరుదెంచు త్రోవలో
ఆకలిని గొన్నాడు ఆసనం బీయండి
కంటక కిరీటంపు కాంతిపుంజము జూచి
కళవళింపకు డోయి కలతపడకం డోయి
'రత్నాక రామూల్య రాగసంపద మెరయు'
నవనీత హృదయుండు నవచూత కోకిలము
రారమ్మ రారమ్మ రారమ్మ రారమ్మ
ఓ తెనుగు పూలార! ఓ యనుగు పూలార!!


5.

ఇతరులతొ సొదలతో ఈ హాస మృదువాస
నలతోడ కొసరు తేనెలతోడ రొదతోడ
ఇతని ప్రణయపు గాథ ఎనలేని పూ బాధ
కన్నీరు కాల్వగా కరిగించె నీ జగతి
మన చిన్ని హృదయాల మన కన్నెభావాలు
పల్లవింపగ జేయ పలవింపగా జేయ
రారమ్మ రారమ్మ రారమ్మ రారమ్మ
ఓ తెనుగు పూలార! ఓ యనుగు పూలార!!


6.

ఆమె యాషాఢ జలధరాయతన సీమ
నొడలు పులకింప నటియించి యొరగి సోలి
మేల్కొనుచు మెరపుటన్నుల మిన్న గాని
దీనుఁ డగు నన్ను నేలెడి తెరవ గాదు


7.

7. స్వాగతోన్ముక్త గీతా స్రవంతి కలుగ
నపుడు ననుఁ బిల్చె నీయలల గములు
ప్రణయరస మధువాహినీ బంధురములు
సైకతముల నేని కనఁగఁ జనఁగ నీవు


ప్రతిభ 1940

________________________________________________________________________________________

428

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1