పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/34

ఈ పుట ఆమోదించబడ్డది

నా చెల్లెలు చిట్టెమ్మకు 'ఇంటాయన' కావడం చేత, ఈయన నాకు బావగారైనారు. 73వ ఏడులో నడుస్తున్న ఈ సాహిత్య పూర్ణపురుషుడు. మా బావ వావిలాల సోమయాజులుగారు, ఆంధ్ర సాహిత్యభాగ్యాన్ని ఇనుమడింపజేస్తూ, అందరినీ ఆశీర్వదిస్తూ నూరేండ్ల కాలాన్ని దాటి, హాయిగ సాహిత్య జీవయాత్ర కొనసాగించాలని త్రికరణ శుద్ధితో కోరుకొంటున్నాను.

పింగళి - కాటూరి

విధేయుడు

సాహిత్యపీఠం, హైదరాబాదు

ఊట్ల కొండయ్య


34

వావిలాల సోమయాజులు సాహిత్యం-1