మహోత్సవ సభల సందర్భంలో వెలువడినా, 1950లో ప్రకటింపబడిన సాతవాహన సంచికలో దర్శనమిచ్చింది. ఇవి ఆ నాటి పండిత పరిశోధకుల మన్ననలందుకొన్నవి.
1940 నుంచిన్నీ ఆయన ఎన్నెన్ని సాహిత్య సంఘాల వ్యవహారాలు నిర్వహించారో లెక్క లేదు. కార్యదర్శిగా సాహితీ సమితిలోనూ, 'ప్రతిభ'కు ఉపసంపాదకుడిగానూ, సహకార్యదర్శిగా నవ్య సాహిత్య పరిషత్తుతోనూ తనకున్న సాన్నిహిత్యం అలా వుండగా, హిందూ కాలేజీ నాటక సమాజానికి, "శారదాధ్వజ" సభకూ, "సుధర్మ” సభకూ కార్యదర్శిత్వమూ, నిర్వహణమూ ఆయనదే. పిల్లలమఱ్ఱి హనుమంతరావు గారధ్యక్షులుగ వున్న జ్యోత్స్నా సమితికి తొలుదొల్త తాను కార్యదర్శి, అనంతరం అధ్యక్షుడు. డాక్టర్ మారేమండ రామారావు గారధ్యక్షులుగా వున్న ఆంధ్రేతిహాస పరిశోధక మండలికి కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో 1963 నుంచీ 73 వరకూ 10 ఏండ్ల పాటు సభ్యుడు - ఇలా ఇంకా ఎన్నెన్నో!
దాదాపు 35 ఏండ్ల పర్యంతం ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలలోనూ - కోస్తా, రాయలసీమ, తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ, ఇంచుమించు అన్ని కళాశాలల్లోనూ అన్ని హైస్కూళ్ళలోనూ సాహిత్యం పైననే గాక, ఇంకా అనేకానేక విషయాలపై సోమయాజులుగారి ఉపన్యాసాలు మారు మ్రోగేయి.
సోమయాజులుగారు ఉత్తమరచనల్ని చాలా అనువాదం చేశారు. మహాకవి జయశంకర్ ప్రసాద్ 'కామాయని'నీ, అంసూ'నూ హిందీనుండీ, షేక్‌స్పియర్ నాటకాలు - జూలియస్ సీజర్, మేక్బెత్, ఆంటోనీ క్లియోపాత్రాలను బహాఈ మతానికి చెందిన అనేక గ్రంథాలనూ, కేథలిక్ క్రయిస్తవుల మతసాహిత్యాన్ని ఇంగ్లీషు నుండీ మనోహరంగా తెలిగించారు. బాల సాహిత్యం కూడా చాలా రచించారు ప్రీ యూనివర్శిటీ, ఇంటర్, బి.ఏ., బి.ఎస్సీ, బి.కాం. తరగతులకు నోట్సు వ్రాశారు అసదృశంగా అనేక సంవత్సరాలు. భువనవిజయ ప్రక్రియ నారంభించడంలోనూ, దాన్ని రూపొందించడం లోనూ, దాని ప్రదర్శనలలో పాల్గొని విజయవంతం చేయడంలోనూ వావిలాలవారు అమోఘమైన పాత్ర నిర్వహించారు.
భువనవిజయం సభల్లో ప్రియదర్శనుడైన తాను ధూర్జటి పాత్రలను పోషిస్తూ వుంటే, నిజంగా ధూర్జటియేనేమో ఈయన అనిపించేవాడు. అంతగా ఆ పాత్రలో ఐక్యమైపోయేవారీ కుమార ధూర్జటి. ప్రకాశం జిల్లా మద్దిపాడులో జరిగిన భువన
30
వావిలాల సోమయాజులు సాహిత్యం-1