పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/218

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే. నిగ్రహానుగ్రహమ్ముల నిల్పి చూపఁ
    బ్రాజ్ఞుఁడును కీర్తిపరుఁడును రాజు - కాన
    అతఁడె యాధారమగుటను బ్రతుకు మంత్రు
    లతని కెపుడప్రియముల మాటాడరాదు. 190

తే. చారుని సహాయ పటిమ నా శత్రువర వి
    శేషముల నన్నిటిని తెలిసికొనినట్టి
    పండితుండైన రాజు అల్పమగుయత్న
    ముననె శత్రువు నోటముఁ గొనగలండు.191

తే. శాస్త్ర తత్త్వజ్ఞుఁడును సుప్రసన్న పండి
    తుఁడును నైనవాఁ డెవ్వఁడు నుండక శత్రు
    ప్రేరణ మ్మున్నతోద్యోగ వృత్తి నున్న
    ప్రౌఢుతోఁబల్కఁ డెపుడును పరుషముగను.192

తే. విరిగి రెండుగ ముక్కలై ప్రిదులువాఁడ
    నెవ్వనికి లొంగ వినతి నర్పించుకొరకు
    స్వామి! ఇద్ది నా నైజదోషమ్ము సుమ్ము
    కనుక ప్రకృతిని దాట శక్యమ్ము కాదు.193

తే. ఒకడు కావించు దుష్కార్య మొక్క కాల
    పాశవశుఁడగు నాతని పాపకృత్య
    ఫలితముగను నవ్వానిదౌ కులమదంత
    యును నశించును సత్య మీ ఉక్తి స్వామి!194

తే. త్రివిధ కార్యమ్ములను పంచరీతిగతుల
    నుచితముగ సమన్వయమును నొనరఁజేసి,
    మంత్రులతో నిర్ణయము చేసి మలఁగు రాజు
    మంచి మార్గమునందు వర్తించువాఁడు.195

తే. ధర్మ, మర్దము, కామమ్ము, కూర్మినొక్క
    టొక్కటిగ మూటిమూటను నొక్క రెంటి
    రెంట కడు పురుషుఁడు స్వీకరించి చేయ
    మూఁటిలో నెప్పుడును రెంటి పాటి చేసి


218

వావిలాల సోమయాజులు సాహిత్యం-1