పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/169

ఈ పుట ఆమోదించబడ్డది


తే. పక్క సవరించి తన పతి వచ్చు వీథి
    చూచు సతి నొక యువకుండు తోచి, తరిమి
    యింటిలోనికి రతిచర్య నలయఁజేసె
    అతనికై చూచుచుండు నిత్యమ్ము నామె.

తే. ఒక్కతన్వి 'నా బ్రతు కెట్టులుండు' ననిన
    “మచ్చ చూడక చెప్పగా మార్గమౌనె”
     అనిన నద్దాని గనుమని యడుగ నంటి
     "అద్ది యున్నది రమ్య రత్నాలయమున.

తే. "ప్రియుని రీతిగ నేను నే ప్రియను బోలి
     యుంద మీనాఁడు నిరువురు ముత్సుకమున
     సోదరుని పోల్కి నీవు నే సోదరినిగ
     నుండ వలెగద రేపటి నుండి మనము.”

తే. "తొందరగ నత్త! పూని కుదుర్చు వాఁడ
     నీ కుమార్తెకు ధనికుతో నేను పొత్తు
     అందులకు నన్ను నాల్నాళు లనుభవింప
     నిత్తుఁ గూతునని ప్రమాణ మీయవలయు.” 84

తే. "శుద్ధయా, ఆమె! ఆయమ వృద్ధవేశ్య'
     అనిన విని యనె "పరిశుద్ధ నమ్మ నేను
     పలువురకుఁ బత్ని నౌటచేఁ బడయ దోష
     మొకడి పెండ్లాము నైయున్న యువిదఁ గాను.

తే. ఏను దుఃఖింపఁ బరికించు మానవుఁడవు
    ఈవు ప్రేమించితివె? ఈయ నేల డబ్బు?
    పాశవ ప్రియు వలెఁ గాక పైకి వచ్చి
    యింగితమ్మిమ్ము ఇత్తు జయించుకొమ్ము.

తే. వలదు ప్రేమ నాకెయ్యది వ్యవధి లేదు
    7ఔదు నే పురుషుడ, గోరుదాడు దాని


7. శిల్పి గాగిన్ జీవితం మీద ఆధారం చేసి సోమర్సెట్ మాహమ్ చేత లిఖింప ఛార్లెస్ స్టిక్స్ లాండ్ అన్నమాటలు

మధుప్రప

169