తే. “అయిన ముద్దిడ నిండు మీ హస్త" మనిన
"హస్తమా? ఏల నీ కిత్తు నద్ది? ఇవిగో,
వీని ముద్దిడు" డనుచు న వ్వీరవనిత
ఇచ్చె మోమును, పెదవిని మెచ్చె ప్రియుఁడు.
తే. 'సకియ కావించు దోష ప్రచార వర్త
నముల పద్ధతులు కడు మనసున నెఱింగి,
పరమ శృంగార వీర కల్పన మొనర్చి
తనకు విఖ్యాతి నొసఁగ నాదాసి మెచ్చె. "
తే. వస్త్రరాహిత్య మోహన వర్తనమ్ము
కన్యకాత్వమ్ము నొందఁగా గలుగు నేర్పు
వడసి విలసిల్లు భోగినీ వనిత లెపుడు
నతని కేలోపమీయలే రచట, సకియ!
తే. మగల సంతోషపెట్టఁగా మనసు వడుటె
ముదితల యలంకరణలకు మొదటి యవధి
ఎరిగి యిద్దాని పురుషులు పరమరక్తి
వనితలను గూర్చి మెలఁగఁగా వలయుఁ గాదె!
తే. కామ లౌల్యమ్ము వ్యథ వెట్టు కాంత, విధవ
నామె పితరుఁడు చేసె సన్యాసినిగను
ఆమె మది కోర్కెఁ దీర్చుకో నయ్యవారిఁ
జేసి వైచెను గామినీ చిత్తజునిగ. 78
తే. ఆమె పొక్కిలి దిగివేగ నడచు నాదు
నేత్రదృష్టిని గనియామె "నేను తొలఁగ
ద్రోసి మొలనూలు విజయ" నౌదు నని నవ్వ
మాని పదకూల భద్రత నూన సాగె.
తే. "ఆమె దేహంపు టందంబు నరసి నావె
యనుచుఁ బినతల్లి యడిగిన నామె మెచ్చ
“ఆమె భర్తను గాకుంట నామెనాకు
నరయఁగా వీటు నీయలే" దంటి నేను.
168
వావిలాల సోమయాజులు సాహిత్యం-1