పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/165

ఈ పుట ఆమోదించబడ్డది


తే. "వృద్ధు నైతి నే ననుచు భీతిల్ల నేల?
     వైద్య శాస్త్రజ్ఞురాల, మీవాంఛఁ దీర్ఘు
     వ్యాధులకు మీరు భయపడవలదనననె
     "ప్రౌఢ! ఇచ్చెద సంతోష బహుమతులను”

తే. "కరుణకున్నది మృదురమ్య కాయ, మరసి
     నంత 'అరుణ' మహోదాత్తయగుచుఁ దోచు
     చెలువ లిరువురి పాట నా చెవులఁ జేరి
     యెదను రెండుగాఁగను విభజింప నేర్చె.” 54

తే. "మిమ్ము నిరువురఁ దమిని ప్రేమింతుఁ గాన
     నెవరిఁ బెండ్లాడుటో మీలొ యెరుక పడదు”
     “కోర మెవరము నిన్నుఁ బోఁగొట్టుకొనఁగ
     పడయవలయును మిమ్మిర్వురఁ భార్యలుగను.”

తే. "అతి ఘనమ్ముగ నాట్యమ్ము నబ్బఁ జేయ
     నిత్తు దేహమ్ము, నాత్మ నే నెవని కైన
     పత్నిపైఁ బ్రేమనన్యను బడయకున్న
     ఆయనకు నేర్పెదను పరకీయకాంక్ష.”

తే. "ఆస్తి నిచ్చుట నన్యాయ మన్న చేసె”
     ననుచుఁ పలుమార్లు మరందితో ననఁగ వదినె
     ఆత "డేమొనర్చెద వీవు" అనఁగ, నామె
     "ఇత్తునామది నీవు సుఖింపు మనియె.”

తే. "ఉన్నయది నీ నిచోళ మదో ఉషస్తి,
     నిలువు, వెడలుపు మార కెన్నేళులయ్యె
     గలసి గుడివీథి యక్కలఁ గాల్వకేగు
     మట పురుషవాసనలు సోకు అంతమారు.”

తే. "అవల దూరాన శృంగార హావభావ
    కేళులను జూచి పొంగెడి క్రింది మంచె
    పైన సన్యస్త మానినీ భక్తి కక్ష్య
    రెంటిలోఁ గాపురము సేయుచుంటి నేను.”


మధుప్రప

165