పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/162

ఈ పుట ఆమోదించబడ్డది


తే. "కశ్యపునకును సురసకుఁ గల్గినట్టి
     అజముఖిదియె యౌను నదృష్ట మవని యందు
     అందముగ నున్న పురుషుల నట్టె పట్టి
     ఘోషిలంగ రమించి సంతోష పడియె.”

తే. "వనిత అజముఖి క్రుద్ధు దుర్వాసుఁ బట్టి
     రతి యొనర్పఁగ నతఁడు గర్వమ్ము తోడ
     నిచ్చె పుత్రులు వాతాపి, ఇల్వలులను
     ఆమె పొగరెంతొ తరిగిన దందువలన.”

తే. "నెలఁత! నను గెల్వ నిర్మోక నృత్యభంగి
     మలను ముకురాన, జూపి సల్లలితగతుల
     నోడితివి, నగ్న శివనాట్య మొనరఁ జూపి
     గెలువ నెందర నీయఁగా గలవు చెలుల! 36

తే. పూలతావిని గ్రహియించు పురుషు లిరుగొ
    కూరుచున్నార లిచట నీ కుట్టిమమునఁ
    బూల, విచ్చినవిగని విస్ఫుల్ల ములుగఁ
    జేసితావి నొసఁగు వారె చేరువారు?

తే. "వెలితివడ నేల? స్వామి! సేవికను నేనె
     ఉంటిఁగద, తెచ్చియిత్తు నీ యుదయమందు
     మైలవడకుండు నిదె మీ కమండలమును”
     అనుచు నగ్నయై తెచ్చె సన్యాసి కనగ.

తే. ప్రణయినీ దర్శనాసక్తిఁ బరుగువెట్టి
    వచ్చితిని తల్లి, ఆరాజ్ఞి భవనమందెఁ
    చేసి కొజ్జాను చెలియ నన్జేరు కొఱకు
    పట్టుకొని రమ్ము, భగవతీ! బాహుచార!

తే. సత్యమో, పురాగ్రీసు దేశమ్ము నందు
    నగరములలోని జనజీవన క్రమమ్ము
    లెన్నొ ఆఫ్రడైట్ దేవి పూజించి సాగు
    ననెడి విషయమ్ము శ్రద్ధతో నరయు దేని?


162

వావిలాల సోమయాజులు సాహిత్యం-1