యుత్తమునిఁ జేయఁగల్గిన యువిధ మంచి
యధిక సౌఖ్యమ్ము నొందెడి యతివ యౌను.”
తే. నన్ను 'నీగ్రెస్ వ', నిజమె! అన్నావు నీవు,
ఉండునట వారిలో నరణ్యోష్టిషమ్ము
అగుము స్వేచ్ఛాప్రియుండ వీయవసరమున
కనఁగ నీగ్రెస్సు నౌదునో కానొ నేను”
ఆ.వె. "మేడిపండు వోలె మేలిమియైయున్న”
దన్నుఁ గనఁగ వచ్చి "యర్ధమయ్యె
రమ్ము తెలిసికొనఁగ, రాత్రికి రారమ్ము
పొట్ట విచ్చి చూచి పురుగుఁ గనవు.”
తే. "నగ్న రూపను, ననుఁ జూడ భగ్నమొంద
దెవని మానస మా తండ్రి యవును యోగి,
లైంగిక క్షుధలకుఁ జిక్కి లొంగిపోని
యతని దేఁగద నారాయణాలయమ్ము.”
తే. 2"ముదిత వౌట భోగము లేక ముదిరె దీవు
నాకు లాభమ్మొ, లాభమ్ము నీకొ కనుము
'అయ్య యొప్పెడు నందాక నాగు' మనిన
నుందుమాయూర నిరువుర ముత్పలాక్షి! 24
తే. 3"ఆమె గంధర్వకాంతయే యౌను, లేక
యంత యౌజ్జ్వల్యరమ్యమ్ము లౌనె యామె
స్తన యుగమ్ము వానిఁగన నాసక్తిఁ గొందు
నెపుడు రవిచంద్రులటుల శోభించు నవ్వి.
తే. "మద్య మాంస ముద్రా మత్స్య మైథునమ్ము
లనెడి పంచమకారమ్ము లార్జనమున
శక్తిఁ బూజించు మహనీయ భక్తవరుల
సాధనములైన నాకు మోక్షమ్ము నిజము. "
- 2. రతి లేక
- 3. Ref. Helan Diary 27 April 1979
160
వావిలాల సోమయాజులు సాహిత్యం-1