తే. నారి! నీవు పిశాచికి ద్వార మెదురు
కొంటి వయ్యది భీతిని గొన్నవాని
దేవపుత్రుని జంపిన తెరవనీవు
దుఃఖదస్తుల చీరెలతోడఁ దిరుగు.
తే. ఇట్లు 'మారిసు వెస్టు' వచించినాడు
అతడు కారలు యాంగను నట్టి యతని
మానసిక శాస్త్ర విజ్ఞాని మహితయశుని
ప్రణయము బాధించె ననుచు తెలిపి.
తే. తనదు నుద్యోగ సహచరి, తన్వి, ప్రేమ
తోడ శయ్యాతలాన సంతోషపరుప
'యూంగు' భార్యకు యువజన యూంగ్ల వలన
లీల నిప్పించె తమి మహాలింగనముల.
తే. పరిణయమునకు భిన్నమై పరుగు ప్రేమ
పెద్ద కాలము సాగిన వేరు పడదు
దినము వంటిదె, దోషమే తెలిపినారు
వెస్టు, 'యూంగులు' ఇర్వురు స్పష్టముగను.
తే. సత్యమౌ ప్రేమ పరిణయ నిత్యమైన
ప్రేమ విషయాన విధులు కల్పించే కొన్ని
షండభర్తల నజ్ఞాన సతుల భావ
బాధలను గూర్చి వేధింప పాడిగాదు. 62
తే. కలుగ సంప్రీతి నవకాశ కలహమపుడు
కంచుకమ్ముల మృదువసనాంచలముల
విప్పి పడవేయు వారికై వీరరసికు
లంపెదరు మక్షికాళి ప్రహర్షమునను.
తే. ఉభయపక్షాల నిట భేదముండ దెపుడు
మనుజ యందున నట్టులే మనుజునందు
వనిత తన యాత్మ ప్రియున కివ్వంగ మాను
నరుడు ఆత్మను ప్రియ కీయ మరచిపోవు.
మధుప్రప155
మధుప్రప
155